• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమ బాట..! కొంపముంచనున్న సీఎం ప్రకటన..!!

|

హైదరాబాద్‌: రెవెన్యూశాఖ మార్పుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే ఉద్యమం ఉధృతం చేయాలని రెవెన్యూ ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నారు. టీజీటీఏ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తే మద్దతిస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వం కచ్చితంగా భూసర్వే చేయాలని రెవెన్యూ ఉద్యోగులు కోరారు. రెవెన్యూను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసింది.

 రెవెన్యూ శాఖను ఇతర శాఖలో విలీనం చేస్తే ఒప్పుకోం..! హెచ్చరిస్తున్న ఉద్యోగులు..!!

రెవెన్యూ శాఖను ఇతర శాఖలో విలీనం చేస్తే ఒప్పుకోం..! హెచ్చరిస్తున్న ఉద్యోగులు..!!

కేసీఆర్ ప్రకటనలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం సమావేశమైన రెవెన్యూ ఉద్యోగులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకుంది. నాలుగున్నరేళ్లుగా రెవెన్యూ శాఖ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఆయనకు నివేదించాలని తీర్మానించింది.

రాజుకుంటున్న రెవెన్యూ నిప్పు..! ప్రభుత్వానికి తగలనున్న సెగ..!!

రాజుకుంటున్న రెవెన్యూ నిప్పు..! ప్రభుత్వానికి తగలనున్న సెగ..!!

తనకు తిరుగులేదని భావిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రెవెన్యూ అగ్గి గట్టిగానే సెగ తగిలేలా ఉంది. గతంలో ప్రశంసించి ఇంక్రిమెంట్లు.. బోనస్ లు ఇచ్చిన సీఎం ఇప్పుడు ఏకంగా రెవెన్యూ శాఖను తీసేస్తానంటూ హింట్ ఇవ్వటం.. ఉద్యోగాలు చేసుకునే వారికి సంఘాలెందుకంటూ ఎద్దేవాచేయటం.. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలపై సీఎం చేసిన కామెంట్స్ కూడా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తించాయి.

సీయం ప్రకటన పట్ల భగ్గుమంటున్న ఉద్యోగులు..! పాలిటిక్స్ కు తమను బలిచేయొద్దంటున్న ఎంప్లాయిస్..!!

సీయం ప్రకటన పట్ల భగ్గుమంటున్న ఉద్యోగులు..! పాలిటిక్స్ కు తమను బలిచేయొద్దంటున్న ఎంప్లాయిస్..!!

అయితే వీరి ప్రభావం ఎంతగా చూపుతుందనే పక్కనబెడితే కీలకమైన రెవెన్యూ యంత్రాంగం చేతులు ఎత్తేస్తే పరిపాలనపై తప్పకుండా ఉంటుందనేది మాత్రం బహిరంగ రహస్యం. అవినీతి కేవలం రెవెన్యూ విభాగంలోనే కాదు అన్నిచోట్ల ఉందంటూ ఉద్యోగులు చెబుతున్నారు. నిన్నటి వరకూ పొగిడిన సీఎం తమను పక్కన బెట్టేందుకు కారణం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

 అవినీతి పేరుతో అంతం చేయొద్దు..! మరో ఉద్యమం చేస్తామంటున్న ఉద్యోగులు..!!

అవినీతి పేరుతో అంతం చేయొద్దు..! మరో ఉద్యమం చేస్తామంటున్న ఉద్యోగులు..!!

ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు వ్యక్తిగత స్వార్ధం కోసమే ఇప్పుడు రెవెన్యూను లేకుండా చేయాలని చూస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. వాస్తవానికి అవినీతి జాబితాలో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండి, సేవలు పొందేందుకు అనువైన శాఖలన్నీ దాదాపు అవినీతి గబ్బు అంటుకున్నవే. వాటిలో గతంలో బీ ఎస్ ఎన్ ఎల్ కూడా ఉండేదని రెవెన్యూ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revenue employees have taken a decision to exacerbate the movement if the government comes to know about the change of revenue. Revenue employees were convened at the TGT office. Revenue officials have asked the government to support a new law and look at the difficulties of the farmers and make sure that the government should make sure land. CM KCR has announced that the revenue will be merged into other branches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more