వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీకి మందు బాబులకు షాక్ ... మద్యం షాపులు మూడు రోజులు బంద్

|
Google Oneindia TeluguNews

హోలీ పండుగ రాబోతోంది. తాగుబోతుల వీరంగాలతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా హోలీ పండుగ తయారవుతోంది. ఇక హోలీ సందర్భంగా రంగుల ఆటలే కాదు తాగి తందనాలాడే వాళ్ళు, తాగి తన్నుకు చచ్చే వాళ్ళు , తాగిన మత్తులో రోడ్ ప్రమాదాలకు గురయ్యే వాళ్ళు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి నడుంబిగించింది తెలంగాణ సర్కార్. అందుకే హోలీ సందర్భంగా మూడు రోజుల పాటు లిక్కర్ కు నో చెప్పింది.

 పీకల దాకా తాగి పెళ్లి పీటల మీదికొచ్చిన వరుడు... పెళ్ళికి నిరాకరించిన వధువు <br> పీకల దాకా తాగి పెళ్లి పీటల మీదికొచ్చిన వరుడు... పెళ్ళికి నిరాకరించిన వధువు

మూడు రోజుల పాటు నో లిక్కర్... సేఫ్ హోలీ అంటున్న తెలంగాణా పోలీసులు

హోలీ ప్రశాంతంగా జరుపుకోవాలంటే హోలీ నాడు లిక్కర్ లేకుంటే అంతా పీస్ ఫుల్ అని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని భావించారు. హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చెయ్యాలని మార్చి 20వ తేదీ హోలీ పండుగ సందర్భంగా రేపటి నుంచి అంటు 20 తేదీ నుంచి 22వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అంటే మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

 The shock of the drunkards for Holi ... wine shops bundh for three days

అన్ని మద్యం దుకాణాలు బంద్ ... ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు .. సీపీ అంజనీ కుమార్

నగర ప్రజలు హోలీని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
హోలీ వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు నగర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలతో పాటు ..కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని,.ప్రయాణీకులపైనా..వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి మందుబాబులకు హోలీ పండుగ సందర్భంగా మాంచి షాక్ ఇచ్చారు తెలంగాణ పోలీసులు. మూడు రోజులపాటు మద్యం షాపులను మూసివేయనున్న నేపథ్యంలో మందుబాబులు ఇప్పటినుండే మందు కొనుగోలు చేసుకునే పనిలో పడ్డారట.

English summary
Telangana government shocked the drunkards during the Holi festival. On the occasion of Holi, the police decided to bundh liquor shops for three days. The decision was made on the occasion of the Holi festival of the day, Apart from being a wines, bars also announced that restaurants should bundh. With the decision taken by Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X