వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ విభజన హామీలు: నాలుగేళ్లైనా ఏం చేశారంటూ కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన విశ్వవిద్యాలయం, పోలవరం ముంపుపై అధ్యయనం చేయడం వంటి విభజన హామీలను వెంటనే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని గతంలో సుధాకర్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

లండన్‌లో మాల్యాతో బాబు భేటీ, రూ.కోట్ల విరాళం!: విజయసాయి సంచలనం, 'ఢిల్లీకి అందుకే' లండన్‌లో మాల్యాతో బాబు భేటీ, రూ.కోట్ల విరాళం!: విజయసాయి సంచలనం, 'ఢిల్లీకి అందుకే'

ఈ క్రమంలో న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరపున న్యాయవాదులు హాజరైనా.. కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగేళ్లైనా హామీలను ఎందుకు అమలు చేయడం లేదని మండిపడింది.

కాగా, దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ కేంద్రం తరపున ధర్మాసనాన్ని తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

The Supreme Court asked Centre to file plea over AP Reorganisation Act

ఈ నేపథ్యంలో పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలనే ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టంలోని హామీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పిటీషన్‌లో ఇంప్లీడ్‌ కావాలన్నారు.

ఇంకా వుంది, త్వరలోనే ప్రకటిస్తా: పవన్ 'స్వాగతం'పై లక్ష్మీనారాయణ ఇంకా వుంది, త్వరలోనే ప్రకటిస్తా: పవన్ 'స్వాగతం'పై లక్ష్మీనారాయణ

తనకు ఎవరిపైనా కోపం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రీడిజైన్ జరగాలని తెలిపారు. పోలవరం రీడిజైన్‌ జరగాలనే అంశాన్ని కేసీఆర్‌ గాలికొదిలేశారని, ఇపుడు ఆయన దృష్టంతా రాజకీయాల చుట్టే తిరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టించుకోకుండా, కాంగ్రెస్‌పై విమర్శలకే కేసీఆర్‌ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎలా పోరాడుతున్నాయో చూసి నేర్చుకోవాలని పొంగులేటి హితవు పలికారు.

English summary
The Supreme Court on Monday asked the Centre to file its response on a plea seeking direction for proper implementation of the Andhra Pradesh Reorganisation Act that led to the bifurcation of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X