వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీతో పాటు అదినాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చర్యలు చేపట్టింది. ఆయన ఇటివల కాంగ్రెస్ పార్టీతోపాటు ః పార్టీ హైకమండ్ పై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటూ ఆయనకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా ఆయన షోకాజ్ నోటిసులకు ఇచ్చే సమాధానాన్ని బట్టి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటీ చర్యలు తీసుకుంటుందనేది తేలనుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయోనంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దీంతోపాటు ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లారు.దీంతో ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగానే ఆయన బీజేపీ నేతలతో కలిసి మంతనాలు జరిపినట్టు ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చర్యలు

కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చర్యలు

ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మణ్ కోదండరెడ్డి అధ్యక్షతన సమాశం జరిపింది. దీంతో రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన వార్తల క్లింపులతోపాటు పలు వీడియోలను వారు పరీశీంచారు. కాగా అయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు, పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సైతం సమాచారం అందించారు. దీంతో కోమటి రెడ్డికి నేడు షో కాజ్ నోటీసులు జారీ చేశారు.

మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పై ఫైర్

మరోసారి కాంగ్రెస్ హైకమాండ్ పై ఫైర్

ఓవైపు ఇదివరకే చేసిన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారి చేసేందుకు పార్టీ నేతలు సోమవారమే సిద్దమైనా...రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈనేపథ్యంలో మరోసారి పార్టీ హైకమాండ్ తోపాటు రాష్ట్ర్ర పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర్ర నాయకత్వం సరిగా లేకనే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉందని లీడర్‌షిప్ ప్రభావం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. పార్టీ వైఫల్యం వల్లే కేసిఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని తెలిపారు.ఇక కేంద్రంలో కూడ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణ ఇచ్చికూడ అధికారం చేజిక్కుంచుకోకపోవడం పార్టీ నేతల వైఫల్యమేనని అని విమర్శించారు.

English summary
The Telangana Congress Party Disciplinary Committee has taken action against MLA Komti Reddy Rajagopal Reddy. about his comments against Congress party along with the party high command
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X