• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ‌హాకూట‌మిలో టీడిపి కోరుతుంది ఆ సీట్లే..! కానీ సుమారు 40 స్థానాల్లో అభ్య‌ర్థుల గెలుపు..? ఎలా అంటే..!

|
  Telangana Elections 2018 : మ‌హాకూట‌మిలో టీడిపి కోరుతుంది ఆ సీట్లే..! | Oneindia Telugu

  హైద‌రాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో సారి త‌న మార్కును చూపించ‌బోతున్నారు ఆ నాయ‌కుడు. అదికార పార్టీని గ‌ద్దెదించేందుకు ఏర్ప‌డిన మ‌మాకూట‌మిలో గెలుపుగుర్రాల‌ను ఎంపిక చేస్తూ త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 35 నుండి 40నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను గెలిపించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. త‌న సొంత పార్టీ అభ్య‌ర్థుల గెలుసుకోసం కాకుండా మిత్ర‌ధ‌ర్మాన్ని పాటిస్తూ ఇత‌ర పార్టీ నేత‌ల‌ను గెలిపించే బాద్య‌త‌ల‌ను ఆయ‌న బుజాన వేసుకుంటున్నారు. అందుకోసం ఎంపిక చేసుకున్న నియోజ‌క వ‌ర్గాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఆ యువ నేత‌. ఇంత‌కీ ఎవ‌రా నేత..? 40నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల గెలుపు అనే బ్రుహ‌త్క‌ర బాద్య‌ల‌ను నెత్తిమీద వేస‌కున్న ఆ నాయ‌కుడు ఎవ‌రు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!!

  కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేవంత్ రెడ్డి కీల‌క పాత్ర‌..! గెలిపించుకుంటానంటున్న వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్..!

  కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేవంత్ రెడ్డి కీల‌క పాత్ర‌..! గెలిపించుకుంటానంటున్న వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్..!

  తెలంగాణ రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రో తెలియ‌క గులాబీ పార్టీ నేత‌లు అయోమ‌యానికి గురౌతుంటే అదే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది కాంగ్రెస్, టీడిపి అదిష్టానం. టీడిపి కి కేటాయిస్తున్న సీట్లు త‌క్కువే అవుతున్నా గెలుపొందే అభ్య‌ర్థులు మాత్రం నాలుగు ప‌దులు ఉంటార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. కూట‌మిలో కొంత మంది విజ‌యాన్ని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీల‌క నేత బుజాన వేసుకుని చ‌క్రం తిప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హాకూట‌మి నేత‌లు గెల‌వ‌బోయే ఆ 40నియోజ‌క వ‌ర్గాల గురించి కూడా పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

  40మంది గెలుపు త‌న ఖాతాలో ఉంది..! ధీమా వ్య‌క్తం చేస్తున్న రేవంత్ రెడ్డి..!!

  40మంది గెలుపు త‌న ఖాతాలో ఉంది..! ధీమా వ్య‌క్తం చేస్తున్న రేవంత్ రెడ్డి..!!

  కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు గ‌తంలోనే 40నియోజ‌క వ‌ర్గాల్లో గెలుపుకోసం క‌స‌ర‌త్తు చేసారు. తాజాగా కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన అదే 40మంది అభ్య‌ర్థుల‌ను గెలుపించుకునేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న నియోజ‌క వ‌ర్గాల్లో సానుకూల అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి గెలిపించుకునే బాద్య‌ల‌ను కూడా ఆయ‌నే తీసుకుంటున్నారు. అంతే కాకుండా పార్టీల‌క‌తీతంగా అభ్య‌ర్థుల‌ను గెలుపించుకునే కార్య‌క్ర‌మారికి శ్రీకారం చుట్ట‌డం కొస‌మెరుపు.

  టీడిపి అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేవంత్ బిజీ..! గెలుపు చాలా ఈజీ..!

  టీడిపి అభ్య‌ర్థుల ఎంపిక‌లో రేవంత్ బిజీ..! గెలుపు చాలా ఈజీ..!

  తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థుల‌ను, గెలుపు గుర్రాల‌ను రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఎంపిక చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్, వ‌రంగ‌ల్ తో పాటు ఖ‌మ్మం జిల్లాల్లో మ‌హాకూట‌మి మెజారిటి సీట్లు గెలుస్తుంద‌ని విశ్వ‌సించ‌డంతో పాటు, అందులో టీడిపి ఎక్క‌వ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుస్తుంద‌ని భావిస్తున్నారు. మిత్ర ధ‌ర్మం ప్ర‌కారం కాంగ్రెస్ తో పాటు కూట‌మి త‌రుపున పోటీ చేసే అభ్య‌ర్థుల గెలుపుకోసం అంద‌రూ ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ త‌రుపున బ‌రిలో నిల‌బ‌డే అభ్య‌ర్థుల త‌రుపున రేవంత్ రెడ్డి ప్ర‌చారం నిర్వ‌హిస్తే గెలుపు త‌ధ్య‌మ‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు.

  అదికార పార్టీకి స‌వాల్ మారిన రేవంత్ వ్య‌వ‌హారం..! ప్ర‌తివ్యూహానికి సై అంటున్న గులాబీ నేత‌లు..!!

  అదికార పార్టీకి స‌వాల్ మారిన రేవంత్ వ్య‌వ‌హారం..! ప్ర‌తివ్యూహానికి సై అంటున్న గులాబీ నేత‌లు..!!

  తెలుగుదేశం పార్టీ నుండి త‌న‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోకి మారిన నేత‌ల గెలుపు బాద్య‌త‌ల‌ను కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. వేం న‌రేంద‌ర్ రెడ్డి, సీత‌క్క‌, ప‌టేల్ ర‌మేశ్ రెడ్డి, విజ‌య‌ర‌మ‌ణారావు, అరికెల న‌ర్సారెడ్డి, రాజారాం యాద‌వ్, పొట్ల నాగేశ్వ‌ర‌రావు, మేడిప‌ల్లి స‌త్యం, భూపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొంత మందిని గెలిపించుకునేంద‌కు రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక రచిస్తున్నారు. మ‌హాకూట‌మిలో 35 నుండి 40 సీట్లు గెలిపించుకుంటే నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా మారోచ్చ‌నేది రేవంత్ రెడ్డి ప్ర‌ణాళిక గా తెలుస్తోంది. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో రేవంత్ ప్ర‌ణాళిక అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జరిగితే అదికార గులాబీ పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది.

  English summary
  Congress Party Working President Revanth Reddy when he was in the TDP party, there are plans to win over 40 candidates from the Telugu Desam Party along with the Congress alliance. He is also taking the rewards of winning positive candidates in the constituencies that have a positive atmosphere across Telangana.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X