వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 కొత్త ఎయిర్ పోర్టులు... వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం....

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్దికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే... ఇందుకు సంబంధించి సాంకేతిక అంశాలపై సాధ్యాసాధ్యాలను సర్వే చేసేందుకు నియమించిన కన్సల్‌టెంట్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. కాగా విమానాశ్రయాలను ప్రారంభించేందుకు తదుపరి చర్యలు తీసుకునేందుకు గాను ప్రభుత్వం సిద్దంగా ఉందని అధికారులు తెలిపారు. కాగా ఇందుకోసం ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ అండ్ ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్ మౌలిక వసతుల కోసం కోటి రుపాయలను కూడ విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

కాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని మామునూరు ,పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్,నిజామాబాద్ జిల్లాలోని జాక్రపల్లి తో పాటు కొత్త గూడేం, ఆదిలాబాద్ ,మహబుబ్‌నగర్ జిల్లాల్లో ఎయిర్ పోర్టులను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలోనే నిర్ణయించారు.

The Telangana government has set the ball rolling to develop six airports

అయితే వరంగల్‌ మామునూరులో ఉన్న ఎయిర్ పోర్టుకు సంబంధించి కొన్ని సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి. శంశాబాద్ ఎయిర్ పోర్టు నుండి 150 కిలోమీటర్ల మేర నూతన ఎయిర్ పోర్టులు నిర్మించవద్దనే ఒప్పందాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్జీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.

కాగా ఇందుకోసం ఇప్పటికే పెద్దపల్లిలో నిర్మించే ఏయిర్ పోర్టు కోసం 750 ఎకరాల భూమి, నిజమాబాద్‌లో 850 ఎకరాలు, అదిలాబాద్ ఎయిర్ పోర్టు కోసం 350 ఎకరాల భూమిని కూడ ప్రభుత్వం గుర్తించింది. ఇదే అంశాన్ని సీం కేసీఆర్ కూడ గతంలోనే ప్రకటించారు.

English summary
The Telangana government has set the ball rolling to develop six airports in the state.The Airports Authority of India (AAI) has been roped in to conduct techno-feasibility studies,both at existing airstrips and for greenfield airports,and it will be paid Rs 4.5 crore consultancy fee for the job ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X