వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం ఓ ప్రమాదకర వ్యక్తి చేతిలో ఉంది..! కేసీఆర్ పై మండిపడ్డ సీఎల్పీ నేత భట్టి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పాలన ఎప్పుడో పడకేసిందని, రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ పథకాలు అందక అనేక సమస్యలకు గురౌతున్న ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతల మీద ఎదురుదాడి చేయడం, ఇతర పార్టీల్లో ప్రశ్నిస్తున్న బలమైన నేతలను నయానో,భయానో తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం తప్ప ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏమీ చేయడం లేదని ఘాటు విమర్శలు చేసారు విక్రమార్క. చంద్రశేఖర్ రావును ఓ ప్రమాదక వ్యక్తితో సంభోదించారు.

ప్రాజెక్టుల విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో ప్రజానికాన్ని చంద్రశేఖర్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని, క్షేత్ర స్థాయిలో జరగుతుంది ఒకటైతే, బయటకు మరోటి చెప్తున్నారదని ఆరోపించారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నడుం బిగించిందని, ఈ నెల 31నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటిస్తూ ప్రభుత్వ హాస్పత్రుల పనితీరును ప్రత్యక్ష్యంగా తెలుసుకుంటామని వివరించారు. సీఎల్పీ బృందం పర్యటించే జిల్లాల షెడ్యూల్ వివరాలను భట్టి విడుదల చేసారు.

 తెలంగాణను ప్రమాదకర వ్యక్తి పాలిస్తున్నాడు..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క..!!

తెలంగాణను ప్రమాదకర వ్యక్తి పాలిస్తున్నాడు..! కేసీఆర్ పై నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క..!!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు పై మండిపడ్డారు. కాళేశ్వరం పూర్తయిందంటున్న చంద్రశేఖర్ రావు , ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలని నిలదీశారు. 80 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసినా ఒక్క ఎకరం కూడా తడవలేదని విమర్శించారు. కాళేశ్వరం బదులు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 11 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చేవని భట్టి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులపై ప్రజలకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు పేరుతో మరో మోసానికి తెరలేపారంటూ భట్టి ఆరోపణలు చేశారు.

 విద్యుత్ వాఖలో అవినీతిపై ప్రశ్నిస్తే ఉలుకెందుకు..! సూటిగా ప్రశ్రించిన సీఎల్పీ నేత..!!

విద్యుత్ వాఖలో అవినీతిపై ప్రశ్నిస్తే ఉలుకెందుకు..! సూటిగా ప్రశ్రించిన సీఎల్పీ నేత..!!

రాష్ట్రానికి అప్పులు తెచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేస్తున్న చంద్రశేఖర్ రావు పెద్ద సన్నాసి అని వ్యాఖ్యానించారు. ఓ ప్రమాదకరమైన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటూ తీవ్రంగా మండి పడ్డారు. విద్యుత్ శాఖలో అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, దానికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే తప్ప ఉద్యోగులు కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతే కాకుండా టీఆర్ఎస్ అంటే టెంపరరీ రాజకీయ సమితి అని తెలంగాణ భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని అన్నారు.

 దారుణంగా ప్రభుత్వ హాస్పత్రుల పరిస్థితులు..! రేపటి నుండి జిల్లాల బాట..!!

దారుణంగా ప్రభుత్వ హాస్పత్రుల పరిస్థితులు..! రేపటి నుండి జిల్లాల బాట..!!

అంతే కాకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ చేస్తున్నారని, యూరియా దొరక్క రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని ప్రభుత్వ దావాఖానాల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, రోగులకు మందులు ఇస్తున్నారో, రంగునీళ్లు ఇస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ హాస్పత్రుల పరిస్థితులు తెలుసుకునేందుకు జిల్లాల బాట పట్టనున్నట్టు భట్టి తెలిపారు.

 రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతాం..! క్షేత్ర స్థాయి పరిస్ధితులు తెలుసుకుంటామన్న భట్టి..!!

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరుగుతాం..! క్షేత్ర స్థాయి పరిస్ధితులు తెలుసుకుంటామన్న భట్టి..!!

క్షేత్ర స్తాయిలో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సీఎల్పీ బృందం కార్యాచరణ రూపొందింస్తోంది. ఈ నెల 31 అంటే రేపటి నుండి నుండి వచ్చేనెల 15వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించేందకు ప్రణాళిక రూపొందించారు భట్టి విక్రమార్క. 31న (అంటే రేపు) కరీంనగర్ లో ప్రారంభయ్యే ప్రభుత్వ ఆస్పత్రుల తనిఖీ కార్యక్రమం వచ్చే నెల 15న నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల పర్యటనలతో ముగుస్తుందని భట్టి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల అందుబాటు, మందుల పంపిణి, హాస్పత్రుల్లో మౌళిక సదుపాయాలు, రోగుల నుండి డబ్బు వసూలు తదితర అంశాలపై దృష్టీ కేంద్రీకరిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు.

English summary
Senior Congress leader Mallu Bhatti Vikramarka was on Telangana cm Chandrasekhar Rao. Chandrasekhar Rao, who is completing Kaleshwaram, has been instructed to tell how many acres have been watered by the project. 80 lakh crore rupees were spent, but not one acre was criticized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X