హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండుతున్న ఎండలు, తెలుగురాష్ట్రాల్లో 12 మంది మృత్యువాత

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మే మాసం రాకముందే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండల తీవ్రతకు తెలంగాణలో 15 మంది చనిపోయినట్టు అధికారుల దృష్టికి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మే మాసం రాకముందే ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండల తీవ్రతకు తెలంగాణలో 15 మంది చనిపోయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఆంద్రప్రదేశ్ లో 12 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణలో హైద్రాబాద్ తో పాటు ఆదిలాబాద్, మహాబూబ్ నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్ లలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు 30 మంది వడదెబ్బతో చనిపోయారని అనధికారిక సమాచారం.అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమటీ సభ్యుల దృష్టికి 15 మాత్రమే వచ్చాయి.అయితే ఇందులో ఏడుగురు వడదెబ్బతో చనిపోయారని త్రీమెన్ కమిటీ నిర్ధారించింది.

తెలంగాణలోని కరీంనగర్ , ఖమ్మం, కుమ్రంబభీమ్ జిల్లా, మహాబూబ్ నగర్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున వడదెబ్బతో మరణించినట్టుగా త్రీమెన్ కమిటీ నిర్ధారించింది.అయితే అనధికారికంగా మరణించినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు.

 The temperatures crossed 40 degrees Celsius in Telangana and Andhra Pradesh

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. నెల్లూరు, గుంటూరు, కడప తదితర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుఅవుతున్నాయి.అయితే వడదెబ్బ కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 12 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అధికారులు.

English summary
The temperatures crossed 40 degrees celcius in most of the districts in Telangana and Andhra PradeshMahaboobnagar, Nizmabad districts recorded 44 degrees celciusAdilabad 44.5 degrees.Unofficial deaths recorded 30 in Telangana 15 deaths have come into the notice of three men committee constituted by the Telangana govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X