వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఫిర్యాదు.. త్వరలోనే ఆ నలుగురిపై వేటు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ కొంతమంది టీఆర్ఎస్ నేతలు పార్టీ కండువాలు మార్చారు. కారు వీడి హస్తం గూటికి చేరారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తొలుత ఫిరాయింపుదారులపైనే దృష్టి సారించింది. ఈక్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్సీలపై చర్యలకు సిద్ధమైంది. దీంతో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు.

గులాబీ వనం నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగిన యాదవరెడ్డి, భూపతిరెడ్డి, కొండా మురళి, రాములు నాయక్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నలుగురు కూడా ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. స్వలాభం కోసం వీరంతా పార్టీ మారారని.. అందుకే చర్యలు తీసుకోవాల్సిందిగా మండలి ఛైర్మన్ ను కోరారు చీఫ్ విప్ పాతూరు సుధాకర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. వీలైనంత త్వరలోనే వీరిపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.

The TRS party is preparing for action on MLCs who left the party
English summary
The TRS party is preparing for action on MLC's who left the party. The party's leaders complained to the Chairman of the Legislative Council Swamy goud. Yadavareddy, Bhupathi Reddy, Konda Murali and Ramulu Nayak were asked to take action against the party defective leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X