వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ‘భారతీయం’.. ఇంగ్లీష్, స్పానిష్ తర్వాత మన భాషలే టాప్!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ మాగాణంలో తెలుగు పండుగకు ముస్తాబవుతున్న వేళ ఓ తియ్యని కబురు అందింది. అమెరికాలో తెలుగుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగేనట.

అమెరికా జనాభా లెక్కలు 2012-16 ప్రకారం అమెరికాలో 3,21,695 మంది తెలుగు మాట్లాడుతున్నారు. వీరందరూ ఐదేళ్లకు పైబడినవారే. పంజాబీని 2,80,867 మంది, బెంగాలీని 2,59,204 మంది, తమిళాన్ని 2,38,699 మంది మాట్లాడుతున్నారు.

The US census is finally counting how many people speak Tamil, Punjabi, Telugu, and Bengali

తెలుగు, తమిళం మాట్లాడే వారిలో అత్యధికులు కాలిఫోర్నియా, టెక్సాస్‌, న్యూజెర్సీలలో నివసిస్తుండగా... పంజాబీ మాట్లాడే వారిలో 48 శాతం మంది కాలిఫోర్నియాలో, బెంగాలీ మాట్లాడే వారిలో 38.6 శాతం మంది న్యూయార్క్‌లో ఉన్నారు.

2012-16 మధ్య కాలంలో అంగ్లేతర భాషలు మాట్లాడే వారి సంఖ్య 21.1 శాతం పెరిగింది. 2007-11 మధ్య నమోదైన 20.3 శాతం వృద్ధికన్నా ఇది అధికం. అమెరికా ప్రభుత్వంలో కూడా భారతీయుల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది.

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తల్లిదండ్రులు మన దేశంలోని పంజాబా్‌కు చెందిన వారే. అలాగే అడోబ్, మైక్రోసాఫ్ట్ సంస్థల సీఈవోలు శంతను నారాయణ్, సత్య నాదెళ్ల ఇద్దరూ ఇద్దరూ తెలుగువారే. వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారు.

హాస్యనటుడు అజీజ్ అన్సారీ తల్లిదండ్రులు మాతృభాష తమిళం. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా తమిళనాడులో పెరిగిన వాడే. తమిళనాడు రాజధాని చెన్నైకి అర్థమేమిటో తెలుసా? తమిళుల నేల అని. 2001 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడులో నివసించే వారలో 90శాతం మంది ప్రజలు తమిళ భాషను అనర్గళంగా మాట్లాడతారట.

దక్షిణ భారతంలో అత్యధికంగా మాట్లాడే భాషలు తమిళం, తెలుగే. ప్రపంచ వ్యాప్తంగా తమిళం మాట్లాడే వారు 70 మిలియన్ల మంది కాగా అమెరికాలో ఈ భాషను మాట్లాడే వారు 2,50,000 మంది. ఇక పాకిస్తాన్‌లో అయితే పంజాబీ భాష ఫేమస్. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక శాతం మాట్లాడే భాష ఇటాలియన్.

అమెరికాలో ఇంగ్లీష్, స్పానిష్ భాషల తరువాత అత్యధికంగా మాట్లాడే భాషలు చైనీస్, కొరియన్. ఆ తరువాతి స్థానం మన భారతీయ భాషలదే.

English summary
As of last week, the US Census Bureau is taking stock of just how many people in the US speak Tamil—along with Punjabi, Telugu, and Bengali. Historically, the way the US census tracked South Asians was messy and often inaccurate—not tracking them at all or confusing them for white. But their ranks in the US have been growing.Nikki Haley, the US ambassador to the United Nations, was born to parents from Punjab, India. The CEOs of Adobe (Shantanu Narayen) and Microsoft (Satya Nadella) are both from Hyderabad, where Telugu is the primary language. Comedian/actor Aziz Ansari’s parents speak Tamil, as does Ansari, to a degree, per the travel log of his trip to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X