వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు, క్రాస్‌ఓటింగ్ జరిగేనా?

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ విప్ జారీచేసినా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ విప్ జారీచేసినా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఈ వెసులుబాటు ఉన్నందున ఈ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు అవకాశం లేకపోలేదనే విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదలుచుకొన్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకె వేయాలి. రెండో ప్రాధాన్యత ఓటు వేయాలంటే తమకు నచ్చిన అభ్యర్థికి రెండో నెంబర్‌ను వేయాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీల విప్ లేదు. ఎమ్మెల్యేలు,ఎంపీలు ఆత్మప్రబోధం మేరకు ఓటు చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

The Whip doesn’t apply to Presidential elections. MPs & MLAs can vote for whoever they want.

తృణమూల్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా కోల్‌కతాలోనే ఓట్లు వేయాలని ఆ పార్టీ చీఫ్ మమతబెనర్జీ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాద్ కోవింద్ గెలుపు లాంఛనమే.మెజారిటీ ఎంతనే విషయమై ఆసక్తి నెలకొంది. యూపీలో బిజెపి అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ 208.

తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 159. అయితే మొత్తం ఓట్ల విలువ 1,09,800. రామ్‌నాధ్‌కోవింద్‌కు 6 లక్షలకుపైగా ఓట్లు రావొచ్చనే అభిప్రాయంతో ఎన్‌డిఏ పక్షాలు అభిప్రాయంతో ఉన్నాయి. ప్రణబ్‌ముఖర్జీకి మాత్రం 7 లక్షల 13వేల ఓట్లు వచ్చాయి.

English summary
The Whip system doesn't apply to the Presidential elections. In fact, if a party or person tries to issue a whip for MPs & MLAs, it might be counted as an offence under IPC 171C: Undue Influence on an Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X