హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: లలితా జ్యూయల్లరీలో వారంలో రెండో చోరి, ఎందుకిలా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:హైద్రాబాద్ లలితా జ్యూయల్లరీ దుకాణంలో శుక్రవారం నాడు మరో దొంగతనం చోటు చేసుకొంది.సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి జి. మధుసూదన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు దొంగతనం చోటు చేసుకోవడం గమనార్హం.

టీవీలో లలిత జ్యూయలరీ అడ్వర్‌టైమ్ మెంట్ చాల ఫేమస్ అయింది. ఈ అడ్వర్‌టైమ్ మెంట్‌లో చెప్పినట్టుగానే దొంగలు కూడ తెలివిగా వ్యవహరిస్తున్నారు. యాడ్‌లో చూపినట్టుగా ఆరు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడ్డారు.

ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన షోరూమ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు శుక్రవారం నాడు కూడ మరో దొంగతనం చోటు చేసుకొంది. ఓ ఓంట ఈ దొంగతనం చేసినట్టు షోరూమ్ నిర్వాహకులు గుర్తించారు.

వారంలో రెండో రోజు లలిత జ్యూయల్లరీలో చోరీ

వారంలో రెండో రోజు లలిత జ్యూయల్లరీలో చోరీ

వారం రోజుల వ్యవధిలో లలిత జ్యూయల్లరీ దుకాణంలో రెండో చోరీ చోటు చేసుకొంది. సోమాజిగూడలోని తమ షోరూమ్‌లో చోరీ జరిగినట్టు లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి జి. మధుసూదన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న తమ షోరూమ్‌కు ఓ జంట 66 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసిందని ఫిర్యాదులో తెలిపారు. తమ సిబ్బందిని గందరగోళానికి గురిచేసి ఈ దొంగతనం చేశారని వెల్లడించారు.

సీసీటీవి పుటేజీ ఆధారంగా గుర్తింపు

సీసీటీవి పుటేజీ ఆధారంగా గుర్తింపు


ఈ నెల 12వ, తేదిన ఈ విషయాన్ని గుర్తించినట్టు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. తర్వాత రోజు ఈ విషయం బయటపడటంతో సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించామన్నారు. చోరీకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆరు రోజుల క్రితమే యాడ్ తరహలోనే

ఆరు రోజుల క్రితమే యాడ్ తరహలోనే


ఆరు రోజుల క్రితం లలిత అడ్వర్‌టైజ్‌మెంట్ తరహలో చోరీ జరిగింది. బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు టీవీలో చూపినట్టుగానే లలిత జ్యూయల్లరీ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు.ఈ నెల 9న లలితా జ్యువెల్లర్స్‌ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు నగ స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు ఈ చోరీ చేసినట్టు సీసీ కెమెరా దృశ్యాలు ఆధారంగా గుర్తించారు.

వరుస దొంగతనాలు

వరుస దొంగతనాలు


ఒకే దుకాణాన్ని లక్ష్యంగా చేసుకొని ఎందుకు దొంగతనాలు చోటు చేసుకొంటున్నాయనే విషయమై చర్చ సాగుతోంది. ఆరు రోజుల క్రితమే దొంగతనం చోటు చేసుకొంది. అయితే ఈ దొంగతనానికి సంబంధించిన దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో దొంగతనం చోటు చేసుకోవడం చర్చనీయాశంగా మారింది.లలిత జ్యువెలర్స్‌‌ ఎండీ కిరణ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టీవీల్లో ఇచ్చిన ప్రకటనలోలాగానే కొందరు దొంగతనాలకు సైతం పాల్పడుతున్నారు.

English summary
second theft in lalitha jewellery in a week. another theft incident happened in lalitha jewellery on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X