హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భలే దొంగ, 150 కేసులు: బంగారు చెవిదుద్దులు, కాళ్ల పట్టీలే టార్గెట్ (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాయమాటలు చెప్పి చిన్న పిల్లల దృష్టి మరల్చి బంగారు చెవిదుద్దులు, కాళ్ల పట్టీలతో ఓ దొంగను హైదరాబాదులోని కాచిగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 20 తులాల బంగారం చెవిదుద్దులు, 2.7 కిలోల వెండి కాళ్ల పట్టీలు, ఓ టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు.

వాటిని కొన్న జ్యువెల్లరీ షాపుల యజమానులు నలుగురిని కూడా అరెస్టు చేశారు. శుక్రవారం ఈస్ట్‌జోన్ కార్యాలయంలో కేసు వివరాలను డీసీపీ రవీందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కాచిగూడ రత్నానగర్‌లో నివాసముండే బత్తుల రవికిరణ్ అలియాస్ టింకు ఎలక్ట్రిషియన్. తొందరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కాలనీల్లో, బస్తీల్లో ఆడుకునే 10-12 సంవత్సరాల బాలికలను టార్గెట్‌గా చేసుకున్నాడు.

భలే దొంగ, 150 కేసులు: బంగారు చెవిదుద్దులు, కాళ్ల పట్టీలే టార్గెట్

బైక్‌పై వచ్చి "మీ డాడి స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకున్నాడు. నీకు స్పోర్ట్స్ పరికరాలు ఇప్పిస్తాను" అంటూ మాయమాటలు చెప్తాడు. బైక్‌పై కూర్చోబెట్టుకొని కొంత దూరం వెళ్తాడు. అక్కడ బైక్ ఆపి "నీ చెవికి ఉన్న బంగారు దుద్దులు, కాళ్ల పట్టీలు తీసేయ్..అవి ఉంటే స్కాలర్‌షిప్, క్రీడా పరికరాలు ఇవ్వర"ని చెప్పి వాటిని తీయిస్తాడు. వాటిని తీసుకొని ఆ బాలికను అక్కడే వదిలి పరారవుతాడు.

అలా దొంగిలించిన వాటిని పాన్‌బ్రోకర్ షాపుల్లో విక్రయిస్తాడు. 2012 నుంచి ఈ రకమైన దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తిలక్‌నగర్‌లో దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో రవికిరణ్‌ను పట్టుకున్నారు. 150 కేసులు ఉండగా 28 కేసుల్లో అతని నుంచి 137 ఐటెమ్స్ రికవరీ చేశారు. 14 పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. కాచిగూడ డీఐ కె.శ్రీనివాస్‌రెడ్డి, నల్లకుంట డీఐ రాఘవేంద్ర, కాచిగూడ డీఎస్సై జగదీశ్వర్‌రావు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నాడు.

భలే దొంగ, 150 కేసులు: బంగారు చెవిదుద్దులు, కాళ్ల పట్టీలే టార్గెట్

కాచిగూడ సత్యనగర్‌కు చెందిన ఈ బత్తుల రవికిరణ్‌(28) మలక్‌పేటలోని రాజ్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌ సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వేతనం రూ.4వేలు కావడంతో విలాసాల కోసం అడ్డదారులు తొక్కాడు. చాలా వరకు సీసీ కెమెరాలను లేని ప్రాంతాలను ఎంచుకొని మరీ ఇలా చోరీలకు పాల్పడ్డాడు. కాచిగూడ ఠాణా పరిధిలో రెండు ఘటనలు సంభవించడంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రవికిరణ్‌ను అరెస్ట్‌ చేశారు.

నగల వ్యాపారులకూ అరదండాలు: రవికిరణ్‌ చోరీ చేసిన నగలను కొన్న ముగ్గురు వ్యాపారులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వినోద్‌కుమార్‌ జైన్‌(చిక్కడపల్లి), సంతోష్‌జైన్‌(కాచిగూడ), జయేష్‌గాంధీ(కాచిగూడ), గౌతమ్‌చంద్‌ జైన్‌(నారాయణగూడ)లను రిమాండ్‌కు తరలించారు.

English summary
A theif Bathula Ravikiran has been arrested by Kachiguda police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X