వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్ర్రాలకు కొత్త గవర్నర్లు ...? అమిత్ షాతో సుదీర్ఘ సమావేశం..అయిన నర్సింహన్...

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో కొత్త గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్ర్రాల గవర్నర్ నర్సింహన్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఉమ్మడి రాష్ట్ర్రంలో సుదీర్ఘకాలం పనిచేయడంతోపాటు ఆయా రాష్ట్ర్రాల్లో ఎన్డీఏ గవర్నర్లను మార్చనుండడంతో గవర్నర్ మార్పిడి ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు అమిత్ షాతో సమావేశంలో బాగంగా గవర్నర్ల నియామకంతోపాటు రాష్ట్ర్రాల్లో తాజా రాజకీయా పరిస్థితులపై చర్చించారు... ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్ర్రాల్లో సమస్యలను స్నేహపూర్వకంగానే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఒక్కోక్కటి పరిష్కారం అవుతున్నాయని చెప్పారు.

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నర్సింహన్

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నర్సింహన్

ఇక సుధీర్ఘకాలంగా గవర్నర్ నర్సింహన్ తెలుగు రాష్ట్ర్రాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఆయన డిశంబర్ 27 ,2009న ఉమ్మడి అంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నర్సింహన్ బాద్యతలు చేపట్టారు. అనంతరం 2014లో రాష్ట్ర్రం విడిపోయిన అనంతరం రెండు రాష్ట్ర్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలోనే భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు. గవర్నర్ గా నియమించినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర్రా ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ వివాదరహితుడిగా కొనసాగుతున్నారు. దీంతో భారత దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం గవర్నర్ సేవలు అందించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం.. మాటల్లో కాదు చేతల్లో చూపండి.. అలీగఢ్ ఘటనపై శివసేన ఆగ్రహం..

యూపిఏ నుండి ఏన్డీఏ వరకు

యూపిఏ నుండి ఏన్డీఏ వరకు

యూపిఏ ప్రభుత్వం నుండి ఏన్డీఏ వరకు , మారని నర్సింహన్ యూపిఏ హయాంలో నియమించబడ్డ గవర్నర్లను దాదాపు ఎన్డీఏ ప్రభుత్వం మార్చి వేసింది. గవర్నర్ నర్సింహన్ ను మాత్రం కొనసాగించింది. కాగా యూపిఏ టర్మ్ లొ నియమించిన వారిలోకూడ ఎక్కువ కాలం ఉన్న గవర్నర్ నర్సింహనే ఉన్నారు. కాగా అటు యూపిఏ లో ను ఇటు ఎన్డీఏలోను కొనసాగిన ఘనత ఆయనది, మరోవైపు రెండు రాష్ట్ర్రాలకు ఎక్కువ కాలం గవర్నర్ గా కొనసాగుతున్న వ్యక్తి నర్సింహన్.

వివిధ రాష్ట్ర్రాల్లో గవర్నర్ల మార్పిడి...

వివిధ రాష్ట్ర్రాల్లో గవర్నర్ల మార్పిడి...

ఇక ఎన్డీఏ రెండవ సారీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర్రాల్లో గవర్నర్లను మార్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే సుధీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ నర్సింహన్‌ను సైతం మార్చనున్నట్టు స్పష్టంమైన సమాచారం అందుతోంది. అయితే నర్సింహన్‌ను రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో ఏదో ఒక రాష్ట్ర్రానికి బాద్యతలు కూడ ఇచ్చి కొనసాగిస్తారని కూడ వార్తలు వెలువడుతున్నాయి..

English summary
There are opportunities to appoint new Governors in two Telugu states. part of these The governor of the joint state of andrapradesh ESL narsimhan has met with central home minister amith shah. they have been discussion for two hours about political developments in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X