వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వానికి మినహాయింపు లేదు.!నగర శివార్లలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచుతున్న యువత..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : లాక్‌డౌన్ ఆంక్షల నుండి చాలా వ్యవస్థలకు మినహాయింపులు లభించినప్పటికి మానవత్వానికి మాత్రం మినహాయింపులు ఉండవంటున్నారు కొంత మంది యువకులు. లాక్‌డౌన్ నుండి అనేక సడలింపులిచ్చిన తరుణంలో చాలా వరకు సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. అయినప్పటికి పూటగడవానికి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నిరుపేదలకు కొంత మంది మానతావాదులు సహాయం చేస్తూనే ఉన్నారు. నగర శివార్లలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా కఠినంగానే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారికి తమ సొంత నిధులతో నిత్యవసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు అందజేస్తున్నారు కొంత మంది యువకులు.

 There is no exception to humanity.!Young people sharing essential commodities.!

ఈ నేపథ్యంలో పఠాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి, ఇస్నాపూర్, లక్డారం, రుద్రారం గ్రామాల్లోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందింస్తున్నారు. అంతే కాకుండా ఎక్కడ పేదలు ఆకలితో అలమటిస్తున్నారో అక్కడకు చేరుకుని నిర్బాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు పఠాన్ చెరు యువకులు. యువతకే ఆదర్శంగా నిలుస్తున్న టీపిసిసి కార్యదర్శి కౌశల్ సమీర్ గతవారం అంతంత మాత్రంగా జీతాలందుకుంటున్న వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు. లాక్‌డౌన్ ఆంక్షలు మొదలైన మొదటిరోజు నుండి నిరుపేదలకు ఏదో రూపంలో సాయం చేస్తూనే ఉన్నారు. కౌశల్ సమీర్ సేవలను భారతదేశ హ్యూమాన్ రైట్స్ కమీషన్ గుర్తించి ప్రశంసా పత్రాన్ని కూడా అందించింది. అంతే కాకుండా మెదక్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంఛార్జ్ గాలి అనిల్ కుమార్ కౌశల్ సమీర్ ను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Restrictions on containment areas on the outskirts of the city seem to be tightening. Some young people are providing essential items, sanitizers and masks with their own funds for those in such a predicament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X