హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలేశ్వరం ప్రాజెక్టుకు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకున్నారు : జేపీ నడ్డా

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కూడ బీజేపి అధికారంలోకి వస్తుందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా అశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నడ్డా ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఈనేపధ్యంలోనే టీడీపీకి చెందిన పలువురు నేతలు నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు.ఇది వరకే పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్ రావుకు నడ్డా కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఎయిమ్స్‌ను అడగ్గానే మంజూరు చేశాం..

ఎయిమ్స్‌ను అడగ్గానే మంజూరు చేశాం..

ఈ సంధర్భంగా నడ్డా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను విమర్శలు చేయదల్చుకోలేదని అన్నారు. అయితే ప్రపంచం మొత్తం ఆయుష్మాన్ భారత్ కార్యకర్యక్రమాన్ని అభినందిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రానికి అడగడంతోనే ఎయిమ్స్ ఆసుపత్రిని మంజూరు చేశామని చెప్పిన నడ్డా దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వంలో పని చేసుందుకు చాలా మంది నేతలు పార్టీలోకి వస్తున్నారని అన్నారు.

30వేల కోట్ల కాలేశ్వరాన్ని లక్ష కోట్లు చేశారు.

30వేల కోట్ల కాలేశ్వరాన్ని లక్ష కోట్లు చేశారు.

ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టులకు పవిత్రమైన పేర్లు పెట్టి ప్రాజెక్టుల్లో కోట్ల రుపాయాలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముప్పైవేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని అన్నారు. ఇందులో భాగంగానే నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు చేశారు. దీంతోపాటు హరిత హరంలో కూడ అక్రమాలు జరిగాయాని హరిత హరం సంభంధించి కనీస అడిట్ కూడ లేదని విమర్శించారు. దీంతో మిషన్ భగీరథ కమీషన్ భగీరథగా మారిందని, కేంద్రం పలు పథకాల్లో ఇచ్చిన నిధులు రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదని అన్నారు.

రాచరికమా.. ప్రజాస్వామ్యామా..?

రాచరికమా.. ప్రజాస్వామ్యామా..?

మరోవైపు అసలు సచివాలయానికే వెళ్లని ముఖ్యమంత్రి సచివాలాయాన్ని ఎలా కూల్చుతున్నారని ఆయన ప్రశ్నించారు. వాస్తు కోసమే సెక్రటేరియట్‌ను కూల్చుతున్నారని విమర్శలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వంలో అసలు మహిళలే లేరని, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా రాచరిక వ్యవస్థలో ఉన్నామా ఆని ప్రశ్నించారు. ఇక డెబ్బే ఎళ్లుగా పరిష్కారం కాని కశ్మీర్ సమస్యను ప్రధాని మోడీ పరిష్కరించారని అన్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్‌పై మోడీ సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

English summary
BJP working president JP Nadda expressed that BJP would come to power in Telangana. Meanwhile, several leaders of the TDP joined the party in the presence of Nadda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X