వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 ఇయర్ ఎండర్: తెలంగాణలో మృతిచెందిన నేతలు వీరే.. రాజకీయ ప్రస్థానం..

|
Google Oneindia TeluguNews

2020లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో కొందరు/ హఠాన్మరణం మరికొందరు చెందారు. వారిలో నాయిని నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, సోలిపేట రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. పది నుంచి 15 మంది వరకు నేతలు చనిపోయారు. ఒక్కో నేత రాజకీయ నేపథ్యం గురించి తెలుసుకుందాం పదండి.

యువ హీరోయిన్ సంజనా లేటేస్ట్ ఫోటో షూట్.. వైరల్ పిక్స్

నాయిని నర్సింహారెడ్డి

నాయిని నర్సింహారెడ్డి

తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అక్టోబ‌ర్ నెల‌లో కన్నుమూశారు. 1934 మే 12న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరడుగొమ్ము గ్రామంలో దేవయ్యరెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నాయిని జన్మించారు. ఆయనకు భార్య అహల్యారెడ్డి, కుమారుడు దేవేందర్‌రెడ్డి, కూతురు సమంతరెడ్డి ఉన్నారు. హెచ్‌ఎస్‌సీ వరకు విద్య నభ్యసించిన నాయిని.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1969లో జయప్రకాశ్‌ నారాయణ శిష్యుడిగా జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1978,1985లో జనతాపార్టీ తరఫున ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 జూన్‌ 2న ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు.

నోముల నర్సింహయ్య

నోముల నర్సింహయ్య

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య డిసెంబ‌ర్ ఒకటో తేదీన గుండెపోటుతో కన్నుమూశారు. 1956, జనవరి 9న నోముల రాములు, మంగమ్మ దంపతులకు నర్సింహయ్య జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1981లో ఎల్‌ఎల్‌బీ, 1983లో ఎంఏ పూర్తిచేశారు. సీపీఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. 1987 నుంచి 1999 వరకు వరుసగా 12 ఏళ్లపాటు నకిరేకల్‌ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999, 2004లో నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

 సోలిపేట రామలింగారెడ్డి

సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ‌స్టులో మృతి చెందారు. ఆయన 2004, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఆయన 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 కావేటి సమ్మయ్య

కావేటి సమ్మయ్య

సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఏప్రిల్‌లో కన్నుమూశారు. ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన కావేటి సమ్మయ్య.. సిర్పూర్‌- టీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి తరఫున 2009, 2010 ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కోనేరు కోనప్ప చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 నంది ఎల్లయ్య

నంది ఎల్లయ్య

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఆగ‌స్టు నెల‌లో క‌రోనాతో కన్నుమూశారు. 1942 జూలై 1న ముషీరాబాద్‌లో జన్మించిన నంది ఎల్లయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆరు సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. సిద్దిపేట లోక్‌సభస్థానం నుంచి ఐదుసార్లు, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.

సున్నం రాజయ్య

సున్నం రాజయ్య

గిరిజన నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజయ్య కరోనా వైరస్ సోకి మృతి చెందారు. సున్నం రాజయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజయ్య 2019లో రంపచోడవరం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

జువ్వాడి రత్నాకర్ రావు

జువ్వాడి రత్నాకర్ రావు


మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జువ్వాడి రత్నాకర్‌రావు మే నెల‌లో మృతి చెందారు. మూడు సార్లు బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1982లో జగిత్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1982లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004లో బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010లో కోరుట్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు.

గుండా మల్లేశ్

గుండా మల్లేశ్

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ (75) అక్టోబ‌ర్ నెల‌లో కన్నుమూశారు. మల్లేశ్‌ తొలిసారిగా 1983లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985-89, 1994-99 లోనూ ప్రాతినిధ్యం వహించారు. 2009లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందడమేగాక, సీపీఐ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు.

అందంతో అదరగొడుతున్న దిగంగన.. జోష్ మామూలుగా లేదుగా..

English summary
2020 year some prominent leaders are dead due to illness and coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X