వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లడ్ శాంపిల్స్‌తో కష్టం: వాటిని పరీక్షిస్తేనే పక్కా.. 'పూరి' విషయంలో ఏం చేస్తారో?

ఒక మనిషి తల వెంట్రుకల్లో దాదాపు 4నెలల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించవచ్చునంటున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్శకుడు పూరి జగన్నాథ్ చుట్టూ తిరుగుతుండటం విషయాన్ని మరింత హీటెక్కిస్తోంది. దాదాపు 11గం. సుదీర్ఘ విచారణ జరిపారంటే.. పూరి దాటవేత ధోరణే ఇందుకు కారణమని తెలుస్తోంది.

మరోవైపు పూరి మాత్రం అసాంఘీక కార్యకలాపాలకు తానెప్పుడూ దూరమే అన్న సంకేతాలు ఇస్తున్నారు.
మొత్తం మీద సిట్ విచారణకు సహకరించిన పూరి.. బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చి తన మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలనుకున్నారు.

<strong>బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్</strong>బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్

బ్లడ్ శాంపిల్స్‌తో కష్టం..

బ్లడ్ శాంపిల్స్‌తో కష్టం..

అయితే కేవలం బ్లడ్ శాంపిల్స్ ను టెస్ట్ చేసినంత మాత్రం ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడా? లేదా? అన్నది గుర్తించడం సాధ్యమేనా?. కచ్చితంగా కాదనే సమాధానమే వస్తోంది. రక్త పరీక్ష నమూనాల్లో కేవలం 15రోజుల క్రితం వరకు ఉన్న డ్రగ్స్ ఆనవాళ్లను మాత్రమే గుర్తించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా నమోదవుతున్న డ్రగ్ కేసుల్లో కేవలం 20శాతం మాత్రమే రుజువు అవుతున్నాయని ఫోరెన్సిక్ విభాగం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్.సి.బి)కి గతంలోనే స్పష్టం చేసింది.

Recommended Video

Tollywood Drug Mafia case : Puri Jagannadh Hearing on Tomorrow
వెంట్రుకలు.. రోమాల ద్వారా పక్కాగా:

వెంట్రుకలు.. రోమాల ద్వారా పక్కాగా:

బ్లడ్ శాంపిల్స్ కాకుండా.. మరే టెస్టుల ద్వారా శరీరంలో 'డ్రగ్స్' ఆనవాళ్లను పక్కాగా గుర్తించవచ్చంటే.. కచ్చితంగా తల వెంట్రుకలు, రోమాలను పరీక్షించడం ద్వారా అన్న సమాధానం వినిపిస్తోంది. ఒక మనిషి తల వెంట్రుకల్లో దాదాపు 4నెలల వరకు డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించవచ్చునంటున్నారు. వాటిని పరీక్షించడం ద్వారా ఈ విషయం పక్కాగా తెలుస్తుందంటున్నారు.

అంతేకాదు, ఒకవేళ శరీరం మీద రోమాలను గనుక పరీక్షిస్తే.. దాదాపు 260రోజుల నుంచి 360రోజుల క్రితం డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్లు కూడా దొరుకుతాయంటున్నారు. దీని ద్వారా 90శాతం కేసుల్లో పక్కా ఆధారాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇక మూత్ర పరీక్షల్లో కేవలం 10రోజుల క్రితం వరకు ఆనవాళ్లు మాత్రమే లభిస్తాయని, ఆ గడువు దాటితే కష్టమంటున్నారు.

శరీరంలో గంజాయి ఆనవాళ్లు ఎన్ని రోజులు:

శరీరంలో గంజాయి ఆనవాళ్లు ఎన్ని రోజులు:

ఒక వ్యక్తి తీసుకునే డ్రగ్ ను బట్టి ఎన్ని రోజుల క్రితం దాన్ని తీసుకున్నాడో అన్నదాన్ని పక్కాగా చెప్పవచ్చునని కేంద్ర ఫోరెన్సిక్ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉదాహరణకు గంజాయి తీసుకుంటే..శరీరంలో దాని ఆనవాళ్లు నెల రోజుల వరకు ఉండే అవకాశముందంటున్నారు. అయితే రక్త పరీక్షల ద్వారా కేవలం రెండు వారాల క్రితం ఆనవాళ్లు మాత్రమే లభిస్తాయంటున్నారు. అదే తల వెంట్రుకలను పరీక్షిస్తే.. 90రోజుల క్రితం నాటి ఆనవాళ్లు కూడా దొరుకుతాయని చెబుతున్నారు.

కొకైన్ తీసుకుంటే:

కొకైన్ తీసుకుంటే:

ఒకవేళ కొకైన్ గనుక తీసుకుంటే.. మూడు నుంచి నాలుగు రోజుల్లో మూత్ర పరీక్ష ద్వారా ఆనవాళ్లు దొరుకుతాయంటున్నారు. తల వెంట్రుకల ద్వారా అయితే 90రోజుల వరకు ఆనవాళ్లు గుర్తించవచ్చునంటున్నారు. అదే రక్త పరీక్ష అయితే రెండు వారాలకు మించి ఆనవాళ్లు దొరకవని చెబుతున్నారు.

జనరిక్.. హెరాయిన్..

జనరిక్.. హెరాయిన్..

జనరిక్ డ్రగ్స్ శరీరంలో కేవలం 12గం. మాత్రమే రక్తంలో ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో ఒక రోజు మాత్రమే, వెంట్రుకల్లో మాత్రం 3నెలల వరకు ఉంటుందంటున్నారు.

ఇక హెరాయిన్ తీసుకుంటే.. మూడు నుంచి నాలుగు రోజుల వరకు మూత్రం ద్వారా ఆనవాళ్లు దొరుకుతాయన్నారు. 12గం.ల్లో బ్లడ్ శాంపిల్స్ లో దొరికిపోతుందని చెబుతున్నారు. తలవెంట్రుకల్లో అయితే 100రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటున్నారు.

ఎల్ఎస్ డి, ఎండీఎంఏ డ్రగ్ వెంట్రుకల పరీక్ష ద్వారా 90నుంచి 250రోజుల వరకు కూడా డ్రగ్స్ ఆనవాళ్లు దొరికే అవకాశం ఉందంటున్నారు.

పూరి విషయంలో బ్లడ్ శాంపిల్స్‌తో సరిపెడుతారా?

పూరి విషయంలో బ్లడ్ శాంపిల్స్‌తో సరిపెడుతారా?

దర్శకుడు పూరి జగన్నాథ్ విషయంలో విచారణ అధికారులు కేవలం బ్లడ్ శాంపిల్స్ తోనే సరిపెడుతారా? లేక ఫొరెన్సిక్ నిపుణుల సూచనల నేపథ్యంలో తలవెంట్రుకలను కూడా పరీక్షించడానికి సిద్దపడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అగస్టు 3తర్వాత పూరిని మరోసారి విచారించే అవకాశం ఉండటంతో.. పోలీసులు అప్పుడెలాంటి పంథాను అనుసరిస్తారన్నది వేచి చూడాలి.

English summary
These are the tests which mentioned here are useful to find out a drugist who consuming drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X