వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక‌ల శిక్ష‌ణ‌కు రాన‌ని మొరాయించిన అదికారులు..! గైర్హాజ‌రైన‌వారికి షోకాజు నోటీసులు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఇక్క‌డైనా బ‌స్సులు, ఆటోలు, టూవీల‌ర్లు మొరాయిస్తుంటాయి. కాని ఇక్క‌డ ప్ర‌భుత్వ అదికారులు మొరాయంచారు. చ‌ద‌వ‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అది ఎక్క‌డో మారుమూల ప‌ల్లెటూర్లో జ‌రిగిందంటే స‌రేలే అనుకువోచ్చు.

అన్నకు తోడుగా చెల్లెలు: ఎన్నికల ప్రచార బరిలో వైఎస్ షర్మిళ.. బహిరంగ సభలు, రోడ్ షోలు అన్నకు తోడుగా చెల్లెలు: ఎన్నికల ప్రచార బరిలో వైఎస్ షర్మిళ.. బహిరంగ సభలు, రోడ్ షోలు

కాని న‌గ‌రం న‌డిబొడ్డున నిర్వ‌హించిన శిక్ష‌ణ‌కు రాకుండా కూర్చున్నారు అదికారులు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గాను హైద‌రాబాద్ జిల్లాలో 17, 18 తేదీల‌లో నిర్వహించిన శిక్ష‌ణ‌కు హాజ‌రుకాని ప్రిసైడింగ్ అధికారులు, స‌హాయ ప్రిసైడింగ్ అధికారుల‌కు షోకాజు నోటీసులు జారీచేస్తున్న‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ ఎం.డి దాన‌కిషోర్ తెలియ‌జేశారు. హైద‌రాబాద్ జిల్లాలో పిఓ, ఏపిఓ విధులు నిర్వ‌హించ‌డానికి మొత్తం 10వేల మంది ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల ఉత్త‌ర్వులు జారీచేయ‌గా 17, 18 తేదీల‌లో నిర్వ‌హించిన శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి 7వేల మందికి పైగా మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని, గైర్హాజ‌రైన‌వారికి నోటీసులు జారీచేశామ‌ని తెలపారు.

They do not come for election training ..! Showcase notices for absenteeism .. !!

17, 18 తేదీల‌లో హాజ‌రుకాని ఉద్యోగుల‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చేందుకు ఉన్న‌తాదికారులు స‌మాలోచ‌న‌ు జ‌రిపారు అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన సికింద్రాబాద్ హ‌రిహ‌రక‌ళాభ‌వ‌న్‌లో మ‌రోసారి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నట్టు తెలిపారు. ఎన్నిక‌ల శిక్ష‌ణ‌కు హాజ‌రుకానివారు 22వ తేదీన త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌ని అన్నారు.

ఎన్నిక‌ల విధుల నుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి వ‌స్తున్నార‌ని, ఎట్టిప‌రిస్థితులోనూ మిన‌హాయింపు కుద‌ర‌ద‌ని ్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల విధుల‌కు హాజ‌రుకానివారిపై ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి తెలిపారు.

English summary
Hyderabad District Election Officer, GHMC official Dankakshor said that the notices issued to the Presiding Officers and Assistant Presiding Officers who were not attended the training held on 17th and 18th of Hyderabad district for conducting the elections would be issued.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X