గర్భీణీ హత్య: క్యారమ్ ఆడి 5 ఏళ్ళ జితిన్‌‌తో సమాచార సేకరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మాదాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద పింకి కశ్యప్ హత్య విషయం ఆమె కొడుకు జితిన్‌కు తెలియదు, తల్లికి అనారోగ్యం ఉందని జితిన్ భావిస్తున్నాడు. జితిన్ నుండి పోలీసులు వివరాలు రాబట్టారు. జితిన్ నుండి రాబట్టిన వివరాలు పోలీసులకు పనికొచ్చాయి. జితిన్‌కు ఇష్టమైన క్యారమ్ ఆడుతూ డీసీపీ అనసూయ జితిన్ నుండి వివరాలు రాబట్టారు.

మాదాపూర్ బొటానికల్ గార్డెన్ కేసు విషయమై సైబరాబాద్ పోలీసులు చాలా కష్టపడి నిందితులను పడ్డారు. పింకిని చంపిన తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి బొటానికల్ గార్డెన్ వద్ద వేశారు.

ఈ మహిళ మృతదేహం ఎవరిది ఎక్కడి నుండి ఈ మహిళను తీసుకొచ్చి హత్య చేశారనే విషయమై పోలీసులు రెండు వారాలుగా కష్టపడి నిందితులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే నిందితులు ఏ రకంగా పింకిని హత్య చేశారనే విషయమై జితిన్ నుండి కూడ పోలీసులు వివరాలను రాబట్టారు.

 క్యారమ్ ఆడుతూ వివరాలు రాబట్టిన పోలీసులు

క్యారమ్ ఆడుతూ వివరాలు రాబట్టిన పోలీసులు

పింకిని హత్య చేసిన విషయం జితిన్ కు తెలియకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. పింకిని హత్య చేసి చాపమీద పడుకోబెట్టారు. అయితే పింకీకి ఆరోగ్యం బాగాలేదని జితిన్ కు చెప్పారు. ఏడేళ్ళ జితిన్‌కు ఈ విషయం తెలియదు, తల్లి నిద్రపోతోందని భావించాడు. అయితే నిందితుల వివరాలను రాబట్టేందుకు జితిన్ నుండి డీసీపీ అనసూయ వివరాలను సేకరించారు. జితిన్ కు క్యారమ్ ఆడడమంటే చాలా ఇష్టం. సుమారు ఐదు గంటల పాటు జితిన్ తో క్యారమ్ ఆడి ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆమె సేకరించారు.

ఆటలో పెట్టి వివరాల సేకరణ

ఆటలో పెట్టి వివరాల సేకరణ

జితిన్‌తో ఆడుతూ పాడుతూ అతనికి ఇష్టమైన విషయాలను తెలుసుకొని వాటిని అందిస్తూ పింకి హత్యకు సంబందించిన వివరాలను డీసీపీ అనసూయ తెలుసుకొన్నారు. అయితే జితిన్‌ను కూడ నిందితులు బెదిరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తన తల్లిని నిందితులు కొట్టారని జితిన్ పోలీసులకు చెప్పారు. అయితే జితిన్ ను కూడ కొట్టి భయపెట్టి ఉంటారని భావిస్తున్నారు.ఈ విషయం అడిగే సమయంలో జితిన్ భయపడి పూర్తిగా చెప్పలేదని డీసీపీ అనసూయ చెప్పారు.

ముక్కలుగా కోసే సమయంలో మేడమీదిక

ముక్కలుగా కోసే సమయంలో మేడమీదిక

పింకీ శవాన్ని ముక్కలుగా కోసే సమయంలో జితిన్ ను మేడమీదికి తీసుకెళ్ళారు. మేడమీద జితిన్ ను ఆడుకొనేలా ఏర్పాట్లు చేశారు. అయితే తన తల్లి ఎందుకు తనతో మాట్లాడడం లేదంటే నిద్రపోతోందని అతడిని నమ్మించారు. ఆరోగ్యం బాగా లేని కారణంగానే తల్లి మాట్లాడడం లేదని జితిన్‌కు చెప్పారు. ముక్కలుగా కోసే సమయంలో మాత్రం జితిన్ మేడమీదికి తీసుకెళ్ళారు. పని పూర్తయ్యాక కిందకు తీసుకొచ్చారు.

 తల్లి తిరిగొస్తోందని

తల్లి తిరిగొస్తోందని

తన తల్లి తిరిగొస్తోందని జితిన్ ఆశిస్తున్నాడు. తల్లి చనిపోయిన విషయం అతడికి తెలియదు. మరోవైపు ఆసుపత్రిలో తన తల్లిని చేర్పించినట్టు నిందితులు చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, అందుకే తనను పోలీసుల వద్ద ఉంచారని అతడు భావిస్తున్నాడు. ఎన్నిరోజులైనా తన తల్లి తిరిగి వస్తోందని జితిన్ భావిస్తున్నాడు. ప్రస్తుతం జితిన్ ను శిశు సంరక్షణ కేంద్రంలో అప్పగించారు పోలీసులు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the investigation of the Kondapur woman murder mystery, police found it a tough job to catch the culprit. They however got to know the name of the native village of the deceased, Bindu alias Pinky.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి