• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆలోచించండి .. అధ్యయనం చేయండి .. తర్వాతే నిర్ణయం తీసుకొండి. అమెరికాలో విద్య కోసం తొందరపడకండి

|

హైదరాబాద్ : ఫార్మింగ్ టన్ వర్సిటీ ఘటనతో విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ఏ వర్సిటీ మంచిది ? గుర్తింపు ఉందా ? ఆన్ లైన్ లో కోర్సులు చేసే వర్సిటీలు ఏవీ ఉన్నాయని విద్యార్థి మదిని తొలచివేస్తోంది. ఇంతకీ వర్సిటీని ఎలా అధ్యయనం చేయాలో తెలియడం లేదా. అయితే ఈ స్టోరీ చదవండి.

ఫార్మింగ్ టన్ తో మసకబారిన పేరు

ఫార్మింగ్ టన్ తో మసకబారిన పేరు

ఏ సంస్థ, పరిశ్రమకు ఉన్న మంచి పేరు. సెకను వ్యవధిలో తొలగిపోతోంది. వాస్తవానికి అమెరికాలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. దీంతోనే ఇతర దేశాల విద్యార్థులు అమెరికా వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో ఫార్మింగ్ టన్ వర్సిటీ ఘటనతో ఆ పేరు కాస్త మసకబారిపోతోంది. అగ్రరాజ్యంలో కూడా ఫేక్ సంస్థలు, విద్యా వ్యవస్థలు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.

ఆలోచించి, అధ్యయనం చేశాకే చేరండి

ఆలోచించి, అధ్యయనం చేశాకే చేరండి

దీంతో అమెరికా ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తమ దేశంలో అన్ని చర్యలు తీసుకున్నా ... జరిగినా లోపంపై ఫోకస్ చేసింది. దీంతోపాటు వర్సిటీ ఎంపిక చేసుకునే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతోంది. ఎంపికచేసే యూనివర్సిటీ గురించి అధ్యయనం చేయాలని, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అమెరికా విద్యా సాంస్కతిక వ్యవహారాల బ్యూరో తెలిపింది. విద్యార్థులకు తలెత్తె సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధమని డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ కరోలిన్ కాసగ్రాన్డి తెలిపారు. వర్సిటీలో చేరే ముందు అక్కడ తరగతి గదులు ఉన్నాయా ? ప్రొఫెసర్లు ఉన్నారా ? అన్నది ముందుగా చూసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలను సంప్రదించి .. వారికి కావాల్సిన సమాచారం తెలుసుకోవాలని కోరారు. సుశిక్షితులైన నిపుణుల సేవలను వాడుకోవాలని .. ఎడ్యుకేషన్ యూఎస్ఏ వెబ్ సైట్ చూడాలని ప్రత్యేకంగా కోరారు.

విదేశీ విద్యార్థులు @ 5 శాతం

విదేశీ విద్యార్థులు @ 5 శాతం

కొందరి స్వార్థం వల్లే విద్యా వ్యవస్థకు మచ్చ వచ్చిందన్నారామె. వారు కొన్ని వర్సిటీలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడ వారికి సహకారం అందితే .. తమ పని కానిస్తుంటారు. అమెరికాలో 10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరందరీకి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్నారు. అమెరికా ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను బట్టి ఏటా విదేశీ విద్యార్థుల సంఖ్య 5 శాతం పెరుగుతోందన్నారు.

అధికార వెబ్ సైట్ మాత్రమే చూడండి ..

అధికార వెబ్ సైట్ మాత్రమే చూడండి ..

అమెరికా ప్రభుత్వం నుంచి అక్రిడేషన్ పొందిన వర్సిటీ జాబితా, వారు నిర్వహించే కోర్సుల సమాచారం ఎడ్యుకేషన్ యూఎస్ఏ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. కాన్సులేట్, రాయబార కార్యాలయాలు, వివిధ నగరాల్లోని అమెరికన్ కార్నర్ కేంద్రాల్లో సమాచారం లభ్యమవుతోంది. నిపుణులు సేవలను వినియోగించుకోని .. ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలను ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలుగవని స్పష్టంచేశారు. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వర్సిటీలు అమెరికాలో ఉన్నాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండటంతో అమెరికా వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. భారత్-అమెరికా సంబంధాలు బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. సాంస్కృతిక ఇబ్బందులు పెద్ద ఉండవని ... పరిశోధన, పారిశ్రామిక అనుకూలతలు బాగుంటాయని పేర్కొన్నారు. తెలుగువారికి అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయని .. ఈ కారణాల చేత విద్య కోసం అమెరికా వచ్చేందుకు యువత మొగ్గుచూపుతోందని పేర్కొన్నారు.

75శాతం మందికి ఉపాధి

75శాతం మందికి ఉపాధి

అమెరికా అందజేసే స్కాలర్ షిప్ లకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని చెప్పారు. పీహెచ్ డ, పీజీ చేసేందుకు వచ్చేవారిలో 75 శాతం మందికి ఉపాది అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అధికారిక వెబ్ సైట్ల ను చూసి మాత్రమే విద్య కోసం రావాలని కోరారు. ఏజెంట్లపై ఆధారపడొద్దని స్పష్టంచేశారు. లేదంటే అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కౌన్సిలర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

English summary
Quality education is available in America. Thus, students of other countries are interested in coming to us. However, according to the American Education Cultural Affairs Bureau, Deputy Assistant Secretary Caroline Kasagrandi said they were willing to salvage the students' doubts. Are there classrooms before reaching the versity? Are there professors? It was suggested to look ahead. Contacting offices across the country and asking them to know the information they need. Special needs of the website of the website should be asked to use expert services.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X