వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన మూడో, చివరి పంచాయతీ ఎన్నికలు: టీఆర్ఎస్ మద్దతుదారులదే హవా!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ, తుది పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. చివరి విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 32వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

11,667 మంది సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డుల్లో 67,316 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు.

Third and Final phase of Gram Panchayat elections end

మొదటి విడతలో 4,135, రెండో విడతలో మొత్తం 4,135 పంచాయతీలకు, మూడో విడతలో మొత్తం 3,529 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తొలి రెండు విడతల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులే ఎక్కువగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. దాదాపు డెబ్బై శాతం స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా స్థానాలను కాంగ్రెస్, ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.

English summary
In Telangana, peaceful polling for the third and final phase of Panchayat elections end. About 70 per cent of voter turnout in elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X