వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! థర్డ్ ఫ్రంట్ అసాధ్యం, అదొక్కటే మార్గం: తేల్చేసిన కారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో మూడో కూటమికి చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికే పలు పార్టీలు మద్దతు తెలుపగా, మరికొన్ని పార్టీలు మాత్రం అంత తేలికగా కాదని చెబుతున్నాయి. తాజాగా, సీపీఎం సీనియర్ నాయకుడు ప్రకాశ్ కారత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దేశ రాజకీయాల్లో ప్రభల మార్పు, నేనే ముందుంటా!: కేసీఆర్ సంచలనందేశ రాజకీయాల్లో ప్రభల మార్పు, నేనే ముందుంటా!: కేసీఆర్ సంచలనం

కేసీఆర్ మూడో కూటమి నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించబోవని సీపీఎం నాయకుడు ప్రకాశ్‌ కారత్‌ అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పవార్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని కలుపుకుని తానో కొత్త కూటమిని తీసుకొస్తానని కూడా ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రయత్నం అసాధ్యమే..

కేసీఆర్ ప్రయత్నం అసాధ్యమే..

‘ఒక్క కేసీఆరే కాదు, ఎవరు చేసినా అంతే.. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి నిర్మించడం అంత సుళువు కాదు. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలు వేరు... విధానాల్లో, ప్రాంతీయ ప్రయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలుంటాయి.. ఇవన్నీ వాటి వాటి నిర్ణయాలను ప్రభావితంచేస్తాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కిందకి రావడం అసాధ్యం. ఒకవేళ కూడగట్టినా అవి నిలబడవు' అని పార్టీ పత్రిక పీపుల్స్ డెమొక్రసీలో తాను రాసిన సంపాదకీయంలో ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు.

అదొక్కటే మార్గం

అదొక్కటే మార్గం


అంతేగాక, ‘డీఎంకే, ఆర్జేడీ లాంటి పక్షాలు ఎప్పటికీ కాంగ్రెస్ తోనే ఉంటాయి. బీజేపీని ఓడించాలంటే ఒక్కటే మార్గం. రాష్ట్రాల వారీగా బీజేపీ-వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో జరిగినదిదే' అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వమైనా అంతే..

కాంగ్రెస్ నేతృత్వమైనా అంతే..

తెలంగాణలోని టీఆర్‌ఎస్‌, ఆంధ్రలోని టీడీపీ, ఒడిశాలోని బీజేడీ.. కాంగ్రెస్‌ సారథ్యంలో పనిచేయడానికి ఇష్టపడవని ఆయన పేర్కొన్నారు. గతంలో యూపీఏ తరహాలో ఓ కూటమి ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని. అయితే కాంగ్రెస్‌ పట్ల విశ్వసనీయత లేనందున దాని సారథ్యానికి మిగిలిన పార్టీలు సమ్మతించవని, అంచేత కాంగ్రెస్‌ నేతృత్వ ఫ్రంట్‌ కూడా విఫలమవుతుందని కారత్‌ తేల్చేశారు.

కేసీఆర్ ప్రయత్నాలు సాధ్యమయ్యేనా?

కేసీఆర్ ప్రయత్నాలు సాధ్యమయ్యేనా?

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఆయన కలిసి చర్చలు కూడా జరిపారు. వచ్చే ఎన్నికల్లోపు మూడో కూటమి సాధ్యమైతే పోటీ చేస్తామని కూడా కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన కూటమిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే, అది ఎంత వరకు విజయవంతమవుతుందో కాలమే నిర్ణయించాలి.

English summary
CPI(M) leader Prakash Karat on Thursday said that any effort to build a non-BJP, non-Congress "federal front" was bound to fail as regional interests would prevent parties from coming together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X