వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్గత అవయవాల వైఫల్యంతో పోరాడుతున్న భీమకు సాయం చేయండి

Google Oneindia TeluguNews

రోజూ ఆడుకుంటూ, ఎగురుకుంటూ ఆనందించాల్సిన తన రెండేళ్ల కొడుకు ఆసుపత్రిలో మంచానికి పరిమితమైపోవడంతో అల్లాడిపోతున్నాడు తిప్పన్న. ఎప్పటికైనా తన కొడుకు కోలుకోవాలని ఆశగా ఎదురుచూస్తూ ఉంది ఈ కుటుంబం. తెలంగాణా రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తుంది తిప్పన్న కుటుంబం. భార్యాభర్తలిద్దరూ వ్యవసాయ కూలీలే. కూలీ డబ్బుులు వస్తేగానీ రోజుగడవని పరిస్థితి వారిది. ఒక్కగానొక్క కుమారున్నే ప్రపంచంగా భావించి బతికే వీరికి పెద్ద కష్టమే వచ్చింది.

This family need RS 10 lakhs for their child health

ఒకరోజు అనుకోకుండా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు తిప్పన్న కుమారుడు భీమ. విపరీతంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అందుకు కారణం ఏమిటో అర్థం కాలేదు ఆ తల్లిదండ్రులకు. తర్వాత వాళ్లు ఆ రోజు ఇంట్లో వండిన పదార్థాలను పరీక్షించారు, కానీ అనుమానాస్పదంగా ఏదీ కనపడలేదు. తర్వాత బాబు తీవ్రమైన జ్వరానికిలోనై మంచం పట్టాడు. దీంతో ఆ కుటుంబం బాధలో కూరుకుని పోయింది. క్రమంగా ముఖం నిండా ఎరుపురంగు దద్దుర్లు వచ్చాయి. ఆ లక్షణాలు ఎంతకూ తగ్గలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

భీమ శంకర్ కు సహాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాంక్ డిటేల్స్ వస్తాయి

This family need RS 10 lakhs for their child health

క్రమంగా బాబు ఆహారం తీసుకోవడం కూడా కష్టమైంది. ఆఖరికి తనకు ఎంతో ఇష్టమైన లడ్డూలను కూడా తినేవాడు కాదు. మొదట కొన్ని రోజులు బాబు తల్లిదండ్రులు ఎలాంటి అనారోగ్య సంకేతాలను గుర్తించలేదు. కానీ చిన్న చిన్న 'కాచ్ అండ్ కుక్' ఆటలకే తీవ్రంగా అలిసిపోవడం గమనించారు. ఒక్కోసారి అతని శరీరం మీద అసాధారణంగా, అర్ధంకాని రీతిలో ఎర్రటి గుర్తులు కనిపించేవి, క్రమంగా అతని శరీరం అసహజ మార్పులకు లోనవుతుందని గ్రహించారు.

This family need RS 10 lakhs for their child health

తర్వాత భీమను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంప్రదించిన ప్రతి హాస్పిటల్ లో వైద్యులు, అనేక రకాల చికిత్సలను సిఫార్సు చేశారు. అవన్నీ అర్థంకాకపోవడంతో భీమ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. చికిత్స అందించడం ఆలస్యమవడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. చివరకు, భీమాను లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడ అతను డెంగ్యూ హెమోరాజిక్ సిండ్రోమ్ అనే సమస్యతో బాధపడుతున్నాడని తేలింది. అతని అంతర్గత అవయవాలు ఒక్కోటిగా పనిచేయడం మానేస్తున్నాయని డాకర్లు కనుగొన్నారు. క్రమంగా శరీర జీవక్రియలు కూడా తగ్గుముఖం పట్టడంతో, ఆహారం తీసుకోలేని స్థితికి చేరుకున్నట్లుగా వైద్యులు కనుగొన్నారు. అప్పటికే అతని కాలేయం విఫలమైంది. అతని గుండె కూడా ఒక క్రానిక్ దశలో ఉన్నట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

ఇప్పటికే ఆ కుటుంబం వారి స్థోమతకు మించి ఖర్చు చేసింది. వారి సేవింగ్స్‌తో పాటు బంధువుల నుంచి3 లక్షల వరకు అప్పుల ద్వారా సేకరించి, బిడ్డ ప్రాణాల నిలుపుకునేందుకు ఆ బాబు తండ్రి చాలా శ్రమించాడు. ప్రస్తుతం ఈ లిటిల్ భీమ "పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU)"లో చికిత్స తీసుకుంటున్నాడు. లైఫ్ సేవింగ్ రెస్పిరేటరీ యంత్రం సహాయం మీద ఉన్నాడు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసేందుకు, అనేక రక్త మార్పిడి పరికరాలు, పంపులను అమర్చారు.

This family need RS 10 lakhs for their child health

ప్రస్తుతం ఈ చిన్నారి బతికి బయటపడాలంటే ఆ కుటుంబానికి సుమారుగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహకారం అవసరం ఉంది.

హిందూ పురాణాల్లోని శక్తివంతమైన పాండవ సోదరుడైన భీమ పేరు పెట్టారు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు. కానీ ఆ భీమ, తన బలాన్ని తిరిగి పొందటానికి పోరాడుతుండగా, మనం సామర్ధ్యం ఉన్నమేరకు అతనికి మద్దతునిద్దాం. మీ వైపు నుంచి వచ్చే ఏ చిన్న సహకారమైనా భీమా ప్రాణాన్ని కాపాడగలదు.

This family need RS 10 lakhs for their child health

ఇక్కడ అతని నిధుల సమీకరణకర్తకు తోడ్పడటం ద్వారా మీరు, అతని ఆరోగ్యం నిలబడడానికి, తన అంతర్గత అవయవాల వైఫల్యాలతో పోరాడటానికి సహాయపడగలరు. ఆ బిడ్డే లోకంగా బతుకుతున్న తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో కొంత విరాళం అందించి వెన్నుదన్నుగా నిలబడాలని కోరుతున్నారు.

సాయం చేయదల్చిన వారు దయచేసి ఈ లింక్ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X