హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓ వైపు శ్రీవారు, ఇంకోవైపు గోవర్ధనోద్ధారి: ఖైరతాబాద్ గణపతి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వినాయక చవితి సందడి ప్రారంభమైంది. ఇప్పటికే చాలాచోట్ల మంటపాలు సిద్ధమయ్యాయి. ప్రధాన చౌరస్తాల్లో విక్రయ కేంద్రాల్లో విభిన్న రూపాల్లో విగ్రహాలను కొలువుదీరాయి. కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

పలుచోట్ల ప్రతిమలను కొనుగోలు చేసిన భక్తులు వాటిని మంటపాలకు తరలించారు. చాలామంది మట్టి విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. పీసీబీ అధికారులు శనివారం సనత్‌నగర్‌లో ప్రత్యేక కౌంటర్ పెట్టి అమ్మకాలు సాగించారు.

రూ.5కే ఎనిమిది ఇంచుల మట్టి ప్రతిమలను విక్రయించారు. సుమారుగా రెండు వేల ప్రతిమలను అమ్మకానికి ఉంచితే నిమిషాల్లో అమ్ముడయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రతిమల అమ్మకాలకు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించారు.

ఆది, సోమవారాల్లో మొత్తం 12,500 విగ్రహాలను అందుబాటులో ఉంచుతున్నారు. కోఠి మహిళా కళాశాల ముందు, మారేడ్‌పల్లి వైఎంసిఏ గణేష్ టెంపుల్, మెహదీపట్నం రైతు బజార్ ముంది, అమీర్ పేట సత్యం థియేటర్ ముందు, జీడిమెంట్ల సుభాష్ నగర్ బస్టాప్ వద్ద, మల్కాజిగిరి గౌతం నగర్ వద్ద, ఉప్పల్ రింగ్ రోడ్డులో, మల్లాపూర్ మాణిక్ చంద్ చౌరస్తా, సనత్ నగర్ పీసీబీ కార్యాలయం ఎదుట అమ్ముతున్నారు.

కాగా, వినాయక నిమజ్జనం కోసం హైదరాబాదు ప్రాంతాల్లోని 24 చెరువులు, తొమ్మిది కొలనుల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మియాపూర్‌లోని పెద్దచెరువు వద్ద మినహా మిగిలిన తొమ్మిది ప్రాంతాల్లో కొలనులను సిద్ధం చేశారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాదులో 58 అడుగుల శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి సిద్ధమయ్యాడు. 130 మంది కళాకారులు దాదాపు రెండున్నర నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

విగ్రహ పనుల కోసం ఏర్పాటు చేసిన కర్రలు, సామాగ్రి శనివారం నాడు సాయంత్రం తొలగించారు. దీంతో గణనాథుడు వద్యుద్దీపాల మధ్య వెలిగిపోయాడు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున భారులు తీరుతున్నారు. వినాయకుడికి ఓ వైపు తిరుపతి వెంకటేశ్వర స్వామి, మరోవైపు గోవర్ధనోద్దారి ప్రతిమలు ఉంచారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

సోమవారం ఉదయం పది గంటలకు గవర్నర్ నరసింహన్ తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులను సందర్శానర్థం అనుమతిస్తారు.

ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ గణపతి

వినాయక చవితి సందడి ప్రారంభమైంది. ఇప్పటికే చాలాచోట్ల మంటపాలు సిద్ధమయ్యాయి. ప్రధాన చౌరస్తాల్లో విక్రయ కేంద్రాల్లో విభిన్న రూపాల్లో విగ్రహాలను కొలువుదీరాయి. కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

English summary
This is Hyderabad Khairatabad Ganesh 2016 idol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X