వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపీసీసీ జాబితా ఇదే...! రెండవ జాబితాలో మ‌రికొంత మంది యువ‌త‌కు ఛాన్స్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ పావుల‌ను వేగంగా క‌దుపుతోంది. ఎలాగైనా అదికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అదికార పార్టీ ఎత్తుల‌కు పైఎత్తులు వేస్తూ గెలుపుగుర్రాల కోసం వేట మొద‌లు పెట్టింది. సిట్టింగ్ స్థానాలు కాపాడుకుంటూనే అదికార గులాబీ సీట్ల పైన క‌న్నేసింది కాంగ్రెస్ పార్టీ. బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను రంగంలోకి దించ‌డ‌మే కాకుండా గెలిచేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని కూడా నూరిపోస్తోంది టీపిసిసి. తాజాగా మొద‌టి జాబితాకు తుది మెరుగులు దిద్దిన కంగ్రెస్ నేడో, రేపో దాన్ని విడుద‌ల చేసేంద‌కు రెఢీ అంటోంది.

 కాంగ్రెస్ జాబితా సిద్దం..! పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు అబ‌ద్దం.. అంటున్న టీపీసీసీ..!!

కాంగ్రెస్ జాబితా సిద్దం..! పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు అబ‌ద్దం.. అంటున్న టీపీసీసీ..!!

ఎన్నికల హడావిడి పెరిగిపోతుండడంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ సహా మిగతా పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకుంటోంది. ఇందుకోసం మరో మూడు పార్టీలతో కూడా జట్టుకట్టబోతుంది. మూడు దశాబ్ధాలుగా ప్రత్యర్ధిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందించిన ఆ పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితిని కూడా కలుపుకుని మహాకూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

Recommended Video

గ్రేట‌ర్ లో గులాబీని నిలువ‌రించేందుకు మహాకూట‌మి..!
 క‌మిటీల‌తో బ‌లోపేతం..! స‌త్తా చూపుతామంటున్న కాంగ్రెస్ నాయ‌కులు..!!

క‌మిటీల‌తో బ‌లోపేతం..! స‌త్తా చూపుతామంటున్న కాంగ్రెస్ నాయ‌కులు..!!

ఎన్నికల కోసం సిద్ధమవుతున్న సందర్భంగా ఆ పార్టీ సైన్యాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ రద్దు జరిగిన తర్వాత దాదాపు రెండు వారాలపాటు స్తబ్ధుగా ఉన్న అధిష్ఠానం.. బుధవారం ఒకేసారి 10 కమిటీలను ప్రకటించింది. రాహుల్‌ ప్రకటించిన 10 కమిటీల్లో కోర్‌ కమిటీ, సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ఎన్నికల కమిటీ, ఎన్నికల ప్రణాళికా కమిటీ, వ్యూహ, ప్రణాళిక కమిటీ, రిజర్వుడు నియోజకవర్గాల్లో నాయకత్వ అభివృద్ధి కమిటీ, ఎన్నికల కమిషన్‌ సమన్వయ కమిటీ, క్రమశిక్షణ చర్యల కమిటీ ఉన్నాయి.

మొద‌లైన గెలుపుగుర్రాల వేట‌.. ! త్వ‌ర‌లో మొద‌టి జాబితా ప్ర‌క‌ట‌న‌..!!

మొద‌లైన గెలుపుగుర్రాల వేట‌.. ! త్వ‌ర‌లో మొద‌టి జాబితా ప్ర‌క‌ట‌న‌..!!

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక పైనా కసరత్తు ప్రారంభించింది. దీనిపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చేసిందని, ఇప్పటికే కొంత మందితో కూడిన జాబితా కూడా సిద్ధమయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాను పార్టీలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలు, 2009లో గెలిచి, ప్రస్తుతం కొనసాగుతున్న వారితో ఈ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జాబితాలో ప్ర‌ముఖ నాయ‌కులంద‌రూ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక రెండవ జామితాలో యువ నేత‌ల‌కు, మ‌హిళ‌ల‌కు ప్రాదాన్య‌త ఇచ్చే దిశ‌గా ఏర్పాట్లు చేస్తోంది టీసీసీసీ.

సీయియ‌ర్ల‌తో తొలి జాబితా..! యువ‌త‌తో మ‌లి జాబీతా..!!

సీయియ‌ర్ల‌తో తొలి జాబితా..! యువ‌త‌తో మ‌లి జాబీతా..!!

ఇక జాబితాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, పద్మావతిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జగ్గారెడ్డి, సుధీర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, టీ.రామ్మోహన్‌రెడ్డి, పి. విష్ణువర్దన్‌రెడ్డి, ముఖేశ్‌గౌడ్‌, రేవంత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, దొంతి మాధవరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సీతక్క, నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితా దాదాపు ఖాయమని, మహాకూటమిలో భాగంగా కొన్ని సీట్లను మిగతా పార్టీలకు సర్ధుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొన్న సందర్భంగా సర్ధుబాటు అనంతరం ఆయా స్థానాలను కూడా ప్రకటించబోతున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
telangana congress party finalised their candidates list. in that list all sitting and senior leaders accommodated and in the 2nd list youngsters takes place. however t congress party is going to give tight competition to trs party inn the next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X