• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాసిరకం బతుకమ్మ చీరల్లో మరో కోణం: లెక్కల్లో తేడా...

By Swetha Basvababu
|

హైదరాబాద్: అవినీతికి తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నది. అంతే కాదు 'ఈ - టెండర్' ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరిస్తున్నామని నమ్మ బలుకుతోంది. తెలంగాణ ఆడబిడ్డలకు సెంటిమెంట్ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా సర్కార్ అట్టహాసంగా నిర్వహించిన 'బతుకమ్మ చీరల' పంపిణీలో రమారమీ రూ.28 కోట్ల పై చిలుకు నిధులపై అనుమానం వ్యక్తం చేస్తూ వార్తాకథనాలు వెలువడ్డాయి.

రాష్ట్రమంతా మహిళాలోకం నాసిరకం చీరలు పంపిణీచేస్తారా? అని మండిపడ్డారు. అడ్డంగా బుక్కైన తర్వాత పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. సిరిసిల్ల చేనేత చీరలు పంపిణీ చేస్తామని ఊరించి.. చివరకు సూరత్ చీరలు పంపిణీ చేసిన నేపథ్యం సర్కార్‌ది.

  Bathukamma sarees Issue : బతుకమ్మ చీరలు : సిరిసిల్ల vs సూరత్‌

  ప్రత్యేకించి చీరల తయారీకి చెల్లించిన సొమ్ముకు సర్కార్ చూపుతున్న లెక్కలకు తేడా కనిపిస్తోంది. అందునా రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నదీ ఇదే సిరిసిల్ల నియోజకవర్గం కావడం మరో ఆసక్తికర పరిణామం. చేనేత కార్మికులకు ప్రచారం కోసం వారానికి ఒకరోజు 'చేనేత' దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు మరి. అందుకు టాలీవుడ్ కథానాయిక సమంతను ప్రచారకర్తగానూ నియమించారు.

  రూ.28 కోట్లు స్వాహ అయ్యాయని ఆరోపణలు

  రూ.28 కోట్లు స్వాహ అయ్యాయని ఆరోపణలు

  కానీ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కోసం అదే సిరిసిల్ల పరిధిలో నేయించిన ఒక్కో చీర తయారీ కోసం ప్రభుత్వం చెల్లించిన సొమ్ముకు లెక్కల్లో చూపుతున్న మొత్తానికి పొంతన కుదరడం లేదనే మాట వినిపిస్తోంది. దీని ప్రకారం ఒక్కో చీరలో రూ.48 ఎక్కడకు వెళ్లాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్లు సిరిసిల్ల చేనేత కార్మికులతో నేయించిన 58, 77,555 చీరలకు రూ.28కోట్ల మేరకు నిధులు పక్కదారి పట్టాయా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టెస్కో అధికారి మాత్రం ప్రజా సంక్షేమం, అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వానికి బిజినెస్, తదితర వ్యవహారాలు, ఖర్చులు ఉంటాయని, అవి చెప్పడానికి తనకు స్థాయి లేదని అంటున్నారు.

  చీర ఉత్పత్తికి రూ.112, ప్రింటింగ్ ప్లస్ రవాణాకు రూ.64

  చీర ఉత్పత్తికి రూ.112, ప్రింటింగ్ ప్లస్ రవాణాకు రూ.64

  సిరిసిల్లలో బతుకమ్మ చీరలను నేయించే బాధ్యతను రాష్ట్ర సర్కార్ టెస్కోకు అప్పగించింది. ఒక్కో చీర, బ్లౌజ్‌ అవసరమయ్యే 6.3మీటర్ల (తెలుపు బట్ట)కు రూ.112 చెల్లించింది. హైదరాబాద్‌, సూరత్‌లలో ప్రింటింగ్‌, రవాణతో సహా ఒక్కో చీరపై సదరు సంస్థ రూ.64 చెల్లించింది. మొత్తంగా చీరకు రూ.176 ఖర్చు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో చీరకు రూ.224 చొప్పున ఖర్చు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్కో చీరపై రూ.48 తేడా కనిపిస్తోంది.

  రాష్ట్రంలోని పేద మహిళలకు 1,04,47,610 చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నది. ఇందులో రెండున్నర నెలల్లో 3,70,16, 000 మీటర్ల తెలుపు బట్ట ఉత్పత్తి అయినట్టు అధికారులు ప్రకటించారు. ఒక్కో చీర, బ్లౌజ్‌కు 6.3 మీటర్ల చొప్పున 58,75,555 చీరల బట్ట ఉత్పత్తి అయింది. ఒక్కో చీర ఉత్పత్తికి ఆసామికి టెస్కో రూ.112 చెల్లిస్తున్నది. సిరిసిల్లలో ప్రింటింగ్‌ అవకాశాలు లేకపోవడంతో అధికారులు హైదరాబాద్‌, సూరత్‌లకు పంపి ప్రింటింగ్‌ చేయించారు.

  ఒక్కో చీర ప్రింటింగ్‌, ట్రాన్స్‌పోర్టు, జీఎస్టీ కలిపితే రూ.64 లెక్కకొస్తున్నది. మొత్తంగా బతుకమ్మ చీర జిల్లా కేంద్రానికి చేరే వరకు రూ.176కు మించదనేది స్పష్టమవుతున్నది. ప్రభుత్వం మాత్రం రూ.224 చొప్పున ఖర్చు అయినట్టు ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో చీరకు రూ.48 తేడా కనిపిస్తోంది. 58 లక్షల పైచిలుకు లెక్కెస్తే రూ. 28,21,22,640 దారి మళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

  నాసిరకం చీరల పంపిణీపై ఇలా విపక్షాల ఆందోళన

  నాసిరకం చీరల పంపిణీపై ఇలా విపక్షాల ఆందోళన

  పంపిణీ చేసిన చీరల్లో సిరిసిల్ల బట్టేనా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టెస్కో అధికారులు రిలయన్స్‌ కంపెనీ నూలు సరి 75, ప్యాక 110 కౌంట్‌ను వినియోగించినట్టు ఆసాములు చెబుతున్నారు. ఈ నంబర్‌ నూలుతో తయారైన బట్ట ప్రింటింగ్‌ చేస్తే పాలిస్టరైనా నాణ్యతగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లో తయారైన గ్రే బట్టతో తయారు చేయించారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  సూరత్ చీరలపై ఆందోళన

  సూరత్ చీరలపై ఆందోళన

  ప్రత్యేకంగా సూరత్‌లో కొనుగోలు చేసిన చీరలపై ప్రతిపక్షాలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఒక్కో చీర ఉత్పత్తి కోసం రూ.224 ఖర్చయిందని ఇప్పటికే టెస్కో ఎండీ చెప్పారని.. సంస్థ జీఎం యాదగిరి పేర్కొన్నారు. ఉత్పత్తి, ప్రింటింగ్‌లకు తోడు అదనంగా అడ్మినిస్ట్రేషన్‌, ఇతర ఖర్చులు ఉంటాయని, ఇవన్నీ చెప్పే స్థాయి తనది కాదని దాటేశారు.

  English summary
  Telangana Government distributed saries to womens in the eve of Bathukamma festival. But there is some doubts here. Government allied institute 'TESCO' had paid to powerloom owners for sary Rs.176 only & in the treasury bills claimed Rs.224.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X