వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుణ్యానికిపోతే పాపం ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..!సీయం కి త‌ల‌నొప్ప‌గా మారిన సోష‌ల్ మీడియా పంచాయితీ.!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మ‌ంచి చేయ‌బోతే చెడు ఎదుర‌వ్వ‌డం అంటే ఇదే..! తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పెద్ద‌మ‌న‌సుతో ఓ స‌‌స్య‌ను పరిష్క‌రించాల‌ని భావిస్తే అది బెడిసికొట్టి త‌ల‌నొప్పిగా పరిణ‌మించింది. మంచిర్యాల జిల్లా నందుపల్లి వ్య‌వ‌సాయ దారుడు శరత్ భూ సమస్య అనేక మలుపులు తిరుగుతోంది. శరత్ వాదననే సీఎం కేసీఆర్ పరిగణనలోకి తీసుకుని భూమికి పట్టా సర్టిఫికెట్ జారీ చేయడం అన్యాయమని సోద‌రి జ్యోతి వాపోయింది. ఈ భూమికే శరత్ కు ఒక్కరికే హక్కు లేదని తమకు కూడా హక్కులు ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. భూమి విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రైతు బంధు సహాయం కూడా పొందలేదని, తీసుకున్నట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమేనని జ్యోతి సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కార్యాలయం మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరికి పంపించింది.

మలుపులు తిరుగున్న శరత్ భూ సమస్య..! రివ‌ర్స్ అవుతున్న కుటుంబ స‌భ్యులు..!!

మలుపులు తిరుగున్న శరత్ భూ సమస్య..! రివ‌ర్స్ అవుతున్న కుటుంబ స‌భ్యులు..!!

సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఫిర్యాదులకు ముఖ్య‌మంత్రి ���ంద్రశేఖర్‌రావు స్పందించిన తీరుపై మిశ్రమ అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌తో మంచిర్యాలలో భూ సమస్యకు పరిష్కారం లభించడంతో మరికొందరు రైతులు అదే బాటన నడుస్తున్నారు. తమ భూమి సమస్యలను పరిష్కరించాలంటూ కొందరు రైతులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ మొదటగా స్పందించిన మంచిర్యాల జిల్లా నందులపల్లి రైతు శరత్ ఉదంతం విచిత్ర మలుపులు తిరుగుతోంది.

ఏడెకరాల భూమి శరత్ ది కాదు..! రోడ్డెక్కిన సోద‌రీమ‌ణులు..!

ఏడెకరాల భూమి శరత్ ది కాదు..! రోడ్డెక్కిన సోద‌రీమ‌ణులు..!

శరత్ తండ్రి శంకరయ్య సోద‌రుల కుటుంబానికి చెందిన జ్యోతి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు చేసింది. శరత్ చెప్పిందే నిజమని నమ్మి ఏకపక్షంగా తమ భూమిని అతని కుటుంబానికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వడం అన్యాయమన్నారు. శరత్ పేర్కొంటున్నట్లుగా సదరు ఏడు ఎకరాల భూమిని తమ కుటుంబం 50 ఏళ్లుగా సాగు చేసుకుంటుందని జ్యోతి పేర్కొంది. ఆ భూమిపై శంకరయ్య ఒక్కరికే హక్కు లేదని, అందులో తమ కుటుంబానికి కూడా న్యాయమైన వాటా ఉందని జ్యోతి తెలిపింది. తాము కోట్లకు పడగలెత్తామని, హైదరాబాద్‌లో ఉంటున్నామనేది కూడా ఎంతమాత్రం వాస్తవం కాదని ఖండించింది.

సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు..! పునఃస‌మీక్షించాలంటున్న జ్యోతి..!!

సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు..! పునఃస‌మీక్షించాలంటున్న జ్యోతి..!!

ఈ భూమి���ి రైతుబంధు పథకం కింద తాము సాయం పొందినట్టు చేసిన ఆరోపణ కూడా అబద్ధమేనని తెలియచేసింది. వ్యవసాయ అధికారుల రికార్డులు పరిశీలించి తాము రైతుబంధు సహాయాన్ని తీసుకున్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని జ్యోతి పేర్కొంది. జ్యోతి పోస్టింగ్‌పై కూడా సీఎం కార్యాలయం స్పందించింది. వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరికి పంపించింది. ఇదిలా ఉండగా గురువారం సిద్దిపేట జిల���లా దుబ్బాక మండలం పెద్దచిక్కోడ్ గ్రామ రైతులు కూడా సోషల్ మీడియా బాట పట్టారు. తమ భూ సమస్యపైనా సోషల్ మీడియా ద్వారా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్ సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్‌తో ఫోన్ లో మాట్లాడారు.

భూప్ర‌క్షాళ‌న‌లో అవ‌క‌త‌వ‌క‌లు..! లోపాల‌ను స‌రిదిద్దాల‌న్న సీయం..!!

భూప్ర‌క్షాళ‌న‌లో అవ‌క‌త‌వ‌క‌లు..! లోపాల‌ను స‌రిదిద్దాల‌న్న సీయం..!!

రైతుల ఫిర్యాదుపై వి��ారణ జరిపి, సమస్య పరిష్కార మార్గం కనుగొనాల్సిందిగా ఆదేశించారు. భూ ప్రక్షాళన సందర్భంగా భూ రికార్డులను సరిదిద్దడంలో క్షేత్రస్థాయి రెవిన్యూ సిబ్బంది అవినీతి, అక్రమాల వల్ల గ్రామాల్లో సమస్యలు మరింతగా పెరిగాయి. భూ ప్రక్షాళనలో తమకు అన్యాయం జరిగిందంటూ రైతులు సీఎం కార్యాలయానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవిన్యూ సిబ్బంది చేతివాటంపైనే ఎక్కువగా ఫ���ర్యాదులు అందినట్టు తెలిసింది. ఒక జిల్లా, ఒక ప్రాంతం అనేది లేకుండా అన్ని ప్రాంతాల నుంచి గుట్టలకొద్దీ ఫిర్యాదులు రావడంతో సీఎం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.

English summary
The Nandupalli of Manchiryala district of Sharath land has been making many changes. Sister Jyoti has said that it is unfair to grant a certificate of land acquired by the Chief KCR of Sharat argument. She said that he has no right to own this one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X