వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొప్ప మనస్సు: ఈ గిరిజన గ్రామంలో వెలుగు నింపిన మహోన్నతుడు ఈ వ్యక్తి

|
Google Oneindia TeluguNews

అది తెలంగాణలోని నిర్మల్ జిల్లా. అందులో గోండుగూడా అనే ఆదివాసీలకు చెందిన కుగ్రామం ఉందని నిన్న మొన్నటి వరకు బయటి ప్రపంచానికి తెలియదు. అక్కడ నివసించే గోండు ప్రజలు అక్కడి అడవులపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తారు.

బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు ఉండవు. ఇందుకోసమేనేమో బహుశా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ గ్రామం నుంచి బడికి వెళ్లినవారు కనిపించరు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు గోండు గూడా అనే గ్రామం ఉందని ప్రభుత్వానికి కూడా తెలియకపోవడం. అయితే ఇక్కడ ఓ గ్రామం ఉందని నరేష్ కదరి అనే వ్యక్తి ప్రపంచానికి తెలియజెప్పాడు.

 గోండుగుడాను బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు

గోండుగుడాను బయటి ప్రపంచానికి పరిచయం చేశాడు

నరేష్ కదరి అనే వ్యక్తి తన ఫౌండేషన్ ద్వారా గోండుగూడాకు మట్టి రోడ్డు వేయించాడు. మట్టి రోడ్డు వేయించడంతో గోండుగూడాలోని ఐదు మంది పిల్లలను ఆ గ్రామానికి దగ్గరలోని మరో ఊరిలో ఉన్న బడిలో చేరిపించాడు. తొలి సారిగా గోండుగూడా నుంచి గిరిజన పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టారు. అంతేకాదు ఆ గిరిజన గ్రామంలోని మహిళలకు తన ఫౌండేషన్ ద్వారా ఉపాధి కల్పించాడు. గోండుగూడా గ్రామ జనాభా 150 మంది. అందులో చాలామంది పాముకాటుకు గురై మృతిచెందుతున్నారు. ఇందుకు కారణం హాస్పిటల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్లు లేవని చెప్పాడు నరేష్.

అందరి సహకారంతోనే...

అందరి సహకారంతోనే...

ముందుగా రోడ్డు వేయించాలని భావించి దస్తూరబాద్ మాజీ ఎస్‌ఐ నాగపురి శ్రీనివాస్ సహాయంతో మట్టిరోడ్డు వేయించాడు. ఇందుకు నరేష్ రూ. 40వేలు ఖర్చు చేశాడు. కాంట్రాక్టర్ ఎస్ఐకి తెలిసిన వ్యక్తి కావడంతో రోడ్డు రోలర్‌ను ఉచితంగా ఇవ్వగా జేసీబీని వారు అద్దెకు తెచ్చుకున్నారు. తక్కువ బడ్జెట్‌తోనే గ్రామానికి రోడ్డు వేయించినట్లు నరేష్ తెలిపాడు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక అక్కడి పిల్లలను స్కూల్లో చేర్పించినట్లు చెప్పాడు. అంతేకాదు... వారిని రోజు స్కూలుకు తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర వదిలేందుకు ఓ ఎద్దుల బండిని కూడా మాట్లాడాడు.

వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు.. ప్రభుత్వం ఆదుకోవాలి

వర్షానికి కొట్టుకుపోయిన రోడ్లు.. ప్రభుత్వం ఆదుకోవాలి

రోడ్డు నిర్మాణం అయితే పూర్తి అయ్యింది కానీ... ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు అంతా పాడైపోయింది. తిరిగి యథాస్థితికి చేరుకుంది. అయితే మళ్లీ గ్రామస్తులతో కలిసి రోడ్డుకు మరమత్తులు చేయించాడు నరేష్.ఇక శాశ్వతంగా రోడ్డు నిర్మాణం జరగాలని ప్రభుత్వాన్ని కోరాడు. మరి ప్రభుత్వం స్పందించి గోండుగూడా గ్రామానికి రోడ్డు వేయాలని ఆశిద్దాం...అదే సమయంలో ఇంతటి కృషి చేసిన నరేష్‌ను అభినందిద్దాం...

English summary
Until recently, no one knew of the existence of Gonduguda, a tiny Adivasi hamlet in the Nirmal district of Telangana. The Gonds in the hamlet, living inside a forest, remained closed off from the rest of the world, and as a result of this, no one in the little village ever went to school. However, with the intervention of 32-year-old philanthropist Naresh Kadari and his foundation – Grameen Support Foundation – a 2-km kachcha road has been laid. And this road has enabled five Gond children to enroll at a nearby government school, the first Adivasis from the village to go to school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X