• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్పందించే హృదయం: సరస్వతీ పుత్రుడికి అండగా.. కవితకు నెటిజెన్ల జేజేలు..!

|

హైదరాబాదు: ఆ యువకుడి వయస్సు 25 ఏళ్లు.. చదువుల తల్లి సరస్వతీ దేవి కటాక్షం ఉన్నప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం మాత్రం ఆ యువకుడికి లభించలేదు. పేదరికంలో ఉన్నప్పటికీ చదువుకోవాలన్న అతని సంకల్పం ముందు అది చిన్నబోయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినప్పటికీ అన్ని అడ్డంకులను ఎదిరించి అధిగమించి ఐఐఎం రాంచీలో సీటు సంపాదించాడు. ఇక ఆ చదువులు చదివేందుకు ఆర్థిక స్తోమత సరిపోలేదు.. సరిగ్గా ఈ సమయంలోనే లక్ష్మీదేవి రూపంలో మరొకరు ఆ కుర్రాడిని ఆదుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ యువకుడి కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం

ఇదిగో ఇక్కడ ఫోటోలో రెడ్ కలర్ షర్ట్ ధరించి కనిపిస్తున్న యువకుడి పేరు కూరాకుల మహేష్. నాగర్‌కర్నూలు ఎలదండ మండలం రాచూరు అనే చిన్న గ్రామం ఇతనిది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం అతనిది. కొడుకును మంచి చదువులు చదివించాలని భావించిన మహేష్ తల్లిదండ్రులు ఎక్కడా రాజీ పడలేదు. తాము పస్తులుండి మహేష్‌ను చదివించారు. మహేష్ డిగ్రీ పూర్తి చేసే వరకు ఆ తల్లిదండ్రులు సహాయం కాస్తో కూస్తో ఉన్నింది. కానీ అతని కలలు సాకారం చేసింది మాత్రం మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కావడం విశేషం. అవును సరస్వతీ పుత్రుడైన మహేష్ చేసిన ఒకే ఒక ట్వీట్‌కు కవిత స్పందించారు. ఇంతకీ మహేష్ చేసిన ట్వీట్ ఏంటి..?

ఐఐఎంలో సీటు సాధించిన మహేష్


తనకు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)రాంచీలో సీటు వచ్చిందని అయితే జూన్ 5వ తేదీలోగా రూ. 1 లక్ష కట్టాలని చెప్పారని మహేష్ ట్వీట్ చేశాడు. తానొక పేద కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పిన మహేష్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీలో ఎంసీజే నాల్గవ సెమిస్టర్ చదువుతున్నట్లు చెప్పాడు. మొత్తం ఐదు ఐఐఎంల నుంచి అడ్మిషన్ ఆఫర్ వచ్చినట్లు మహేష్ చెప్పాడు. దయచేసి సహాయం చేయాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితలకు కూడా ట్యాగ్ చేశాడు. సాధారణంగా ఇలాంటి ట్వీట్స్‌కు ఎప్పుడూ స్పందించే వ్యక్తి మంత్రి కేటీఆర్. అయితే ట్వీట్ చూడటం మరిచారో ఏమో తెలియదు కానీ... ఆయన సోదరి మాజీ ఎంపీ కవిత మాత్రం మహేష్ ట్వీట్‌ను చూశారు స్పందించారు.

 స్పందించిన కవిత..

స్పందించిన కవిత..

తన గురువు, గైడ్ మెంటార్ అన్నీ తన హిస్టరీ లెక్చరర్ వెంకటేశ్వర్ అని చెప్పాడు మహేష్. హైదరాబాదులోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెంకటేశ్వర్ హిస్టరీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారని చెప్పాడు. ఇక ఇలాంటి ప్రీమియర్ ఇన్స్‌టిట్యూట్స్‌లో సీటు సంపాదించాలని ఎప్పుడూ తన గురువు వెంకటేశ్వర్ ప్రోత్సహించేవారని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక సీటు రాగానే డబ్బులకు ఇబ్బంది అయినప్పుడు మంత్రి కేటీఆర్‌కు కవితకు ట్వీట్ చేసి ప్రయత్నించాలన్న మంచి సలహా ఇచ్చింది కూడా వెంకటేశ్వర్ అని గుర్తు చేశాడు మహేష్. గురువు ఇచ్చిన సలహా మేరకు ట్వీట్ చేయగా రెండు రోజుల్లోనే కవిత స్పందించినట్లు చెప్పాడు. తన కోర్సుకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు చెప్పి సంతోషం వ్యక్తం చేశాడు మహేష్. భవిష్యత్తులో తాను చదవాలనుకుంటున్న పైచదువులకు కూడా ఆర్థిక సహాయం చేస్తానని కవిత మాట ఇచ్చినట్లు మహేష్ చెప్పాడు. కవితకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

సంకల్ప బలం ముఖ్యం..

సంకల్ప బలం ముఖ్యం..

ఇక ఐఐఎం రాంచీలో అడ్మిషన్ పొంది అక్కడ చేరితే తన గ్రామం నుంచి ఒక ఐఐఎంలోకి అడుగుపెట్టిన తొలి విద్యార్థిగా మహేష్ రికార్డు సృష్టించనున్నాడు. అంతేకాదు తన గ్రామంలోని ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవనున్నాడు. సంకల్ప బలం ఉంటే అనుకున్నది ఎంత కష్టమైనప్పటికీ సాధించొచ్చని మహేష్ చెబుతున్నాడు. ఇదిలా ఉంటే చాలామంది పేద విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో పలురకాల వివక్షకు గురవుతున్నారని చెప్పాడు. కానీ తన విషయంలో ఎప్పుడూ అలా జరగలేదని చెప్పుకొచ్చాడు. తనకు మంచి టీచర్లు దొరికారని ఎప్పుడూ ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నాడు.

మొత్తానికి ఈ సరస్వతీ పుత్రుడికి మాజీ ఎంపీ కవిత లక్ష్మీదేవి రూపంలో వచ్చి తన చదువులు ఆగకుండా తన కలలు సాకారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు మహేష్. ఇక కవిత చేసిన సహాయం చూసిన నెటిజెన్లు ఆమెకు జేజేలు పలుకుతున్నారు.

English summary
Former MP Kavitha has once again shown her humanity by helping a poor student who wished to study in IIM and got admission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X