• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు- ఏర్పాట్లు ఇవీ, గూగుల్ సహకారం

|

హైదరాబాద్:ఖైరతాబాద్ గణేషుడు ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో గంగమ్మ చెంతకు చేరుకుంది. గణేషుడి విగ్రహాన్ని ఆరు గంటల్లో నిమజ్జనం చేసారు. క్రేన్ నెంబర్ 6వ వద్ద 57 అడుగులు అతిపెద్ద వినాయకుడిని నిమజ్జనం ేచేశారు. గణేషుడి నిమజ్జనం కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేశారు. ఏడుగంటలకు ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒకటింటికి నిమజ్జనం పూర్తయింది. అతిపెద్ద గణేషుడి నిమజ్జనం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సాగర్ ప్రాంగణమంతా జై గణేష్ నినాదాలతో మార్మోగిపోయింది.

ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ గుండా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం జరగనుంది. మధ్యాహ్నంలోపు నిమజ్జనం పూర్తి చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడిని సప్త ముఖ కాలసర్ప మహాగణపతిగా తీర్చిదిద్దారు.

 గూగుల్ సహకారం

గూగుల్ సహకారం

నగరంలో వినాయక నిమజ్జనానికి గూగుల్ సాయం అందిస్తోంది. నిమజ్జన ఊరేగింపు, ట్రాఫిక్ పరిస్థితి గురించి ఎప్పటికి అప్పుడు అప్ డేట్స్ అందిస్తుంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి గణనాథులు తరలి వస్తున్నాయి.

 నిమజ్జనం రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

నిమజ్జనం రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాదులో 66 చోట్ల ట్రాఫిక్ మళ్లింపు ఉందని పోలీసులు తెలిపారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఎంజే మార్కెట్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌లో ట్రాఫిక్ మళ్లింపు ఉంది.

మాసాబ్ ట్యాంక్, తెలుగు తల్లి ప్లై ఓవర్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్లను మూసివేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు నిమజ్జనం రూట్లో రావొద్దని పోలీసులు ముందే సూచించారు.

గూగుల్ మ్యాప్‌లో ఎప్పటికి అప్పుడు ట్రాఫిక్ అప్ డేట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

నిమజ్జనానికి ఏర్పాట్లు ఇలా

నిమజ్జనానికి ఏర్పాట్లు ఇలా

ట్యాంక్ బండ్ సహా 35 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. నిమజ్నజం కోసం 200కు పైగా క్రేన్లను ఏర్పాటు చేశారు. 65 వేల మంది పోలీసులు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.సెంట్రల్ ఫోర్స్, షీ టీమ్స్, సిటీ ఆర్మ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్‌తో నిఘా ఉంచారు.

ట్యాంక్‍‌బండ్, ఇతర చెరువుల వద్ద కొత్తగా 450 ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.రాచకొండ పరిధిలో 160 కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేశారు.

పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 481 మంది సూపర్ వైజర్లు, 719 మంది ఎస్ఎఫ్‌ఏలు, 8,5,97 మంది కార్మికులను నియమించారు. నిమజ్జన ప్రాంతాల్లో 27 ప్రత్యేక వైద్య శిబిరాలు, 92 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 101 వాటర్ క్యాంపు ద్వారా 30 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. 31 జిల్లాల్లో పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 74,809 విగ్రహాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశారు.

ఇతర ప్రయివేటు సంస్థలు, పలు దుకాణదారులు మధ్యమధ్యలో వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి ఆయా గణనాథుల గురించి వివరిస్తున్నారు.

 శోభాయాత్ర సాఫీగా

శోభాయాత్ర సాఫీగా

శోభాయాత్ర సాఫీగా సాగేందుకు దారిపొడవునా పెద్ద ఎత్తున సిబ్బందిని మోహరించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రూ.16.68 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్లపై అపరిశుభ్రత లేకుండా కార్మికులు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు శోభాయాత్ర జరిగే 374 కి.మీ.మేర మార్గాల్లో ప్రతి 3 కి.మీ.లకు ఒక గణేష్‌ యాక్షన్‌ బృందాన్ని నియమించినట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి 35 ప్రాంతాల్లో 117 స్టాటిక్‌ క్రేన్‌లు, 96 సంచార క్రేన్‌లు రంగంలోకి దిగాయి. రూ.94.21 లక్షలతో విద్యుత్తు విభాగం ద్వారా 34,926 తాత్కాలిక విద్యుద్దీపాలు, రోడ్లు, భవనాల శాఖ విద్యుత్తు విభాగం ఆధ్వర్యంలో 75 జనరేటర్లు ఏర్పాటు చేశారు. జలమండలి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం రాత్రి ఏడు గంటల వరకు హైదరాబాదులో 42వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. ఒక్క హుస్సేన్ సాగర్‌లోనే 12,540 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి.

English summary
City Police Commissioner Anjani Kumar, on Friday notified traffic regulations in the twin cities in connection with Ganesh immersion procession on September 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X