వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చంపేస్తామని వార్నింగ్స్.. మల్లారెడ్డికి సోషల్ మీడియా ట్రోల్స్.. కేసులు

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి. కిషన్ రెడ్డిని చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఏకంగా ఆయనకే ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి కిషన్ రెడ్డి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు . అదే సమయంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాలను కూడా పెంచారు . ఆయన ఇంటి వద్ద నిఘా పటిష్టం చేశారు.

కేంద్ర హోం శాఖా మంత్రికి బెదిరింపు కాల్స్పై అలెర్ట్ అయిన అధికారులు .. దర్యాప్తు
సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే.ఆ తర్వాత మంత్రిగా మార్క్ చూపించాలనుకున్న కిషన్ రెడ్డి ఉగ్రవాదులను, ఉగ్రవాదులకు సహకరిచే వారిని ఏరి పారేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హైదరాబాద్ ఉగ్రవాదులకు సహకరించే వారికి అడ్డాగా మారిందని వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎంఐఎం ఖండించింది.

threatening calls to minister Kishan Reddy .. trolls to minister mallareddy .. cases filed

ఇక తాజాగా ఆయనకు చంపేస్తామని బెదిరింపు కాల్స్ రావటం వెనుక కారణం ఏమి ఉంటుంది అని పోలీసులు నిఘా పెట్టారు. ఆకతాయిలు చేసిన పనా లేకా నిజంగానే ఆయనకు ప్రాణ హాని కలిగించే ఉద్దేశం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని ఐపీ అడ్రెస్ ఆధారంగా పట్టుకోటానికి పోలీసులు యత్నం చేస్తున్నారు.

మల్లారెడ్డి కి సోషల్ మీడియాలో ట్రోల్స్.. కేసు నమోదు
ఇక కిషన్ రెడ్డి కే కాకుండా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి.. సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. మంత్రి మల్లారెడ్డి గురించి ఫేస్ బుక్ లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిని కొంతకాలంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ విషయమై మంత్రి మల్లారెడ్డి ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్న వ్యక్తుల కంప్యూటర్ ఐపీ అడ్రస్‌లను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేయనున్నారు.

English summary
G Kishan Reddy Union deputy Home Minister is threatened by unknown people. As a result, he is issuing warnings through internet voice calls. Minister Kishan Reddy complained to the cyber crime police that anonymous people were being harassed by these threats.The police registered the case and are inquiring about where the phones are coming from. At the same time, security forces were also increased at Kishan Reddy's house. He has intensified intelligence at his home. Telangana Labor Minister Malla reddy have suffered harassment in social media.In the social media, Minister Mallareddy has been trolling and has complained to the police about this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X