వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు బాలికలపై అత్యాచారం, బాలుడిపై లైంగిక వేధింపులు

వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో బాలుడిపై లైంగిక వేధింపులకు దిగాడు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

వనపర్తి: ట్యూషన్‌కు వెళుతున్న ముగ్గురు చిన్నారులకు చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి, ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల్లో ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలు, మరొకరు అదే వయసున్న బాలుడు ఉన్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

నిందితుడిని గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మదనాపురం మండలంలోని గోవిందహళ్లి గ్రామానికి చెందిన 8 సంవత్సరాల ఇద్దరు బాలికలపై అదే గ్రామానికి చెందిన దాసరి శేఖర్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజులుగా ఆ ఇద్దరు చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.

 three children sexually assaulted in Vanaparthi district

దాంతో వారి తల్లిదండ్రులు ఎందుకు వెళ్లరంటూ అరా తీశారు. దీంతో జరిగిన సంఘటన ఆ తల్లిదండ్రులకు వివరించారు. అదే గ్రామానికి చెందిన 4వ తరగతి చదువుతున్న బాలుడినికూడా లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ఈ ముగ్గురు చిన్నారులు ట్యూషన్‌కు వెడుతుండగా వారికి చాకెట్ల ఆశచూపి ఇంట్లోకి పిలిచిన శేఖర్ ఆ తరువాత అత్యాచారానికి పాల్పడిననట్లు డిఎస్‌పి చెన్నయ్య వివరించారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు శేఖర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. అతనిపై పోకస్ యాక్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అత్యాచారానికి గురైన చిన్నారులను వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ ఆదిత్య తెలిపారు.

English summary
Three children have been sexually assaulted by a man Dasari Sekhar in Vanaparthi district of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X