హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బేగంపేట్, చందానగర్, కోకాపేట్: భాగ్యనగరాన్ని చుట్టుముట్టిన కరోనా: మరో మూడు పాజిటివ్ కేసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, దాని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ. కట్టుదిట్టమైన నిషేధాజ్ఙలు అమలు చేసినప్పటికీ.. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూనే ఉంది. తాజాగా తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది.

 బేగంపేట్, చందానగర్, కోకాపేట్‌లల్లో..

బేగంపేట్, చందానగర్, కోకాపేట్‌లల్లో..

తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేట్, శివార్లలోని కోకాపేట్, చందానగర్‌లల్లో ఈ మూడు కేసులు కూడా కొత్తగా నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం తాజాగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ ముగ్గురూ విదేశాల నుంచి వచ్చిన వారే.

లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో..

లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో..

రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో నివసించే 49 సంవత్సరాల వ్యక్తిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేర్చారు. కొద్దిరోజుల కిందటే ఆ వ్యక్తి లండన్ నుంచి కోకాపేట్‌కు వచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. నాలుగు రోజుల కిందటే అతను కోకాపేట్‌కు వచ్చాడని, అనంతరం జ్వరం, దగ్గుతో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా పరీక్షలను నిర్వహించారు.

జర్మనీ నుంచి వచ్చని మహిళలో..

జర్మనీ నుంచి వచ్చని మహిళలో..


నగర శివార్లలోని చందానగర్‌లో నివసించే 39 సంవత్సరాల మహిళలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. చాలాకాలంగా ఆమె జర్మనీలో నివసించారు. కొద్దిరోజుల కిందటే జర్మనీ నుంచి చందానగర్‌కు వచ్చారు. ఆ వెంటనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు రక్త పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు నిర్ధారించారు. వెంటనే ఆమెను ఐసొలేషన్ వార్డుకు తరలించారు.

సౌదీ అరేబియా నుంచి వచ్చిన వృద్ధురాలిలో..

సౌదీ అరేబియా నుంచి వచ్చిన వృద్ధురాలిలో..


హైదరాబాద్ బేగంపేట్‌లో నివసించే 61 సంవత్సరాలు ఉన్న ఓ వృద్ధురాలు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు. జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన ఆమె కొద్దిరోజుల కిందటే అక్కడి నుంచి నగరానికి తిరిగి వచ్చారు. కొద్దిరోజులుగా తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించగా.. వైరస్ సోకినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఒకేరోజు మూడు కేసులు నమోదు కావడం తెలంగాణ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

English summary
Three fresh cases has been reported in Telangana on Wednesday. Total Positive case number in reached 36. Telangana government has issued fresh bulletin in this regards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X