హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిస్సింగ్‌లపై సోషల్ మీడియాలో ప్రచారం... అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

మనుష్యులు అదృశ్యమవుతున్నారంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురిచేస్తున్నారు. రాష్ట్ర్రంలోని 10 రోజుల్లోనే 500మందికి పైగా పలు కారణాలతో పిల్లల నుండి పెద్దలు, మహిళలు తప్పిపోయారని వార్తలు వచ్చాయి. దీంతో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు చెలరేగాయి. అయితే మహిళలు, పిల్లలను ప్లాన్‌తో కొన్ని ముఠాలు అపహరించుకుని పోతున్నాయా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.

 three people were arrested who is Campaigning in social media about missing

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఇవన్ని కూడ వ్యక్తిగత కారణాలతో తప్పిపోయారని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే పలువురు తప్పిపోతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. అయితే పిల్లలు, మహిళలు తప్పిపోవడం ప్రజల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఠాలు కట్టి మహిళలను పిల్లలను ఎత్తుకుపోతున్నారా అనే అనుమానాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈనేపథ్యంలోనే హైదరాబాద్ లో కొంతమంది యువకులు ఒక్కరోజులోనే వందాలాదీ మంది తప్పిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ మోతీనగర్‌కు చెందిన గురిజాల వెంకట్‌, కొత్తగూడేనికి చెందిన క్రాంతికిరణ్‌ నాయుడు, మహబూబ్‌నగర్‌కు చెందిన బాలరాజును సైబర్‌ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కూడ ''తెలంగాణ యువసైన్యం'' పేరుతో హైదరాబాద్‌లో ఒక్కరోజే 82 మంది అదృశ్యమైనట్టు ప్రచారం చేశారని పోలీసులు తెలిపారు.. అపహరణ ముఠాలు హైదరాబాద్‌లో తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పోలీసులు తెలిపారు.

English summary
The three people were arrested by the Hyderabad police. who is Campaigning in social media about missing. they are Venkat Moti Nagar and Kranti kiran of Hyderabad Balaraju from MahabubnagarIn the name of the ''yuva synyam" they propaganda like 82 people disappearing in one day in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X