చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో దాడి: ఆంధ్రా టెక్కీ లావణ్య ఏడ్చినా కాపాడేందుకు రాలేదు! ముగ్గురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత మంగళవారం చెన్నైలోని తలంబూరు - పేరుంబాక్కమ్ రోడ్డులో అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో దొంగల దాడిలో గాయపడిన లావణ్య మాట్లాడుతూ.. తనపై దాడి జరిగిన సమయంలో తాను ఏడుస్తూ, అరిచినా సాయం చేసేందుకు కొందరు ముందుకు రాలేదన్నారు.

చదవండి: 5కి.మీ వెంబడించి మరీ..: ఆనవాళ్లు చెప్పిన టెక్కీ లావణ్య, దాడి వాళ్ల పనేనా?

తాను గాయపడి అక్కడ పడి ఉన్నప్పటికీ అటు నుంచి అటు వెళ్తున్న కొందరు వ్యక్తులు, ఇతరులు పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత గాయపడ్డ ఆమెకు ఇద్దరు వ్యక్తులు సహకరించారు. అందులో ఒకరు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. మరొకరు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీస్ కమిషనర్‌కు జరిగిన విషయం చెప్పిన టెక్కీ

పోలీస్ కమిషనర్‌కు జరిగిన విషయం చెప్పిన టెక్కీ

విచారణ నిమిత్తం వచ్చిన పోలీస్ కమిషనర్ విశ్వనాథ్‌కు బాధితురాలు లావణ్య రెడ్డి ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని కమిషనర్ అన్నారు. ఆమె చాలా ధైర్యవంతురాలు అని చెబుతూ, ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఆఫీస్‌కు వెళ్తానని చెప్పారు.

ముగ్గురి అరెస్ట్

ముగ్గురి అరెస్ట్

కాగా, టెక్కీ లావణ్య పైన దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని వినాయక మూర్తి, నారాయణ మూర్తి, లోగేష్‌లుగా గుర్తించారు. వీరంతా సెమ్మెంచేరిలోని సునామీ క్వార్టర్స్‌కు చెందినవారు.

ప్రధాన నిందితుడు దాడి చేసి లాక్కున్నాడు

ప్రధాన నిందితుడు దాడి చేసి లాక్కున్నాడు

ఈ ఘటనలో వినాయక మూర్తి ప్రధాన నిందితుడు అని పోలీసులు వెల్లడించారు. ఇతను బాధితురాలి పైన దాడి చేశాడని, ఆ తర్వాత ఆమె నుంచి ల్యాప్‌టాప్, రెండు సెల్ ఫోన్లు తీసుకున్నాడని చెప్పారు. అలాగే మూడు వరుసల గోల్డు చైన్లు లాక్కున్నాడని చెప్పారు.

పోలీసులు టీంలుగా వెతికారు

పోలీసులు టీంలుగా వెతికారు

నిందితుల కోసం ఆరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. వారికి సైబర్, ఫోరెన్కిస్ నిపుణులు కూడా సహకరించారు. లావణ్య స్కూటీ పైన వెళ్తుంటే నిందితులు దాడి చేసి ఆమె నుంచి రాబరీ చేసిన విషయం తెలిసిందే.

English summary
Software engineer Lavanya, who was attacked on Thalambur-Perumbakkam Road around 1.30 a.m. last Tuesday, said she was crying for help and no one stopped by to help her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X