వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో ట్వీస్ట్, వెంకటేశ్‌తో మూడేళ్ల క్రితమే పెళ్లి, విభేదాలు రావడంతో..

|
Google Oneindia TeluguNews

బ్యాంకు ఉద్యోగి దివ్య దారుణ హత్యకు గురైన ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. దివ్య హతమార్చిన నిందితుడు వెంకటేశ్ గౌడ్‌తో దివ్యకు మూడేళ్ల క్రితమై పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరికీ ఉస్మానియా వర్సిటీలో చదివే సమయంలోనే పరిచయం అని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వెంకటేశ్ వేధించాడని.. ఆ సమయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..


ప్రేమ పెళ్లి తర్వాత వారిలో విభేదాలు వచ్చాయి. ఇద్దరి కులాలు కూడా వేరు కావడంతో వెంకటేశ్ గౌడ్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉన్నారు. వివాహం జరిగే సమయంలో దివ్య మేజర్ కాకపోవడంతో తర్వాత ఆమెను పేరెంట్స్‌ హాస్టల్‌లో ఉంచారు. హాస్టల్‌లో ఉండి దివ్య చదువుకొంటుండగా.. వెంకటేశ్ వేధించేవాడు. విషయం పెద్దల వరకు వెళ్లడంతో పంచాయతీ కూడా పెట్టారు. దివ్య జోలికి రావొద్దని పెద్దలు స్పష్టంచేయగా, రానని వెంకటేశ్ హామీ పత్రం కూడా రాసిచ్చినట్టు తెలుస్తోంది.

బ్యాంకులో ఉద్యోగం

బ్యాంకులో ఉద్యోగం

హాస్టల్‌లో ఉంటూనే దివ్య చదువుకొంది. ఆరునెలల క్రితం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ)లో ఫీల్డ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన సందీప్ అనే యువకుడితో దివ్య పేరెంట్స్ పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 26వ తేదీన దివ్య, సందీప్ పెళ్లి జరగాల్సి ఉంది. దివ్యకు ఉద్యోగం రావడం, మరొ యువకుడితో పెళ్లి జరుగుతుందని తెలిసి వెంకటేశ్ గౌడ్ కసి పెంచుకున్నాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కొద్దని ఉద్దేశంతో అంతం చేయాలనుకున్నాడు. రోజులాగే మంగళవారం సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన దివ్యపై దాడి చేశాడు.

15 పొట్లు

15 పొట్లు

ఆరేసిన బట్టలు తీసేందుకు పైకి వెళ్లి కిందకి రాగా మృత్యువు ఎదురయ్యింది. తనతో తీసుకొచ్చిన కత్తితో మెడపై దాడి చేశాడు. గొంతు కోసి, 15 పోట్లు పొడిచి పారిపోయాడు. దివ్య కుప్పకూలిపోయింది. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. స్పాట్‌లోనే దివ్య చనిపోయారు.

Recommended Video

#HappyBirthdayKCR : Craze Ka Baap | Birthday Wishes Pour In For KCR | Oneindia Telugu
ఐదు బృందాల గాలింపు

ఐదు బృందాల గాలింపు

హత్య జరిగిన తర్వాత వేములవాడలోని వెంకటేశ్ ఇంటికి తాళం వేసి ఉంది. వెంకటేశ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయనే హత్య చేశారనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. వెంకటేశ్ పేరెంట్స్ పరాశురాములు, తల్లి మల్లీశ్వరీని రాజన్న సిరిసిల్లలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గజ్వేల్ తీసుకొచ్చి విచారిస్తున్నారు. వెంకటేశ్ కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

English summary
bank employee divya knot venkatesh three years before only gajwel police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X