హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో నగ్నచిత్రాలు పెడతానని..: ఎస్సై కారు డిక్కీలో వెళ్లి పక్కా ప్లాన్‌తో అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నీ నగ్న చిత్రాలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వాలని లేకుంటే వాటిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హిమయత్ నగర్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు ఆమె సహాధ్యాయి. పోలీసులు పక్కా ప్లాన్‌తో వారిని అరెస్టు చేసారు.

ఎస్సై కారు డిక్కీలో వెళ్లి మరీ నిందితులను పట్టుకున్నారు. ఓ యువతి ట్రెయినింగ్ కోసం బంజారాహిల్స్‌లోని ఓ ఈవెంట్‌ అకాడమీలో చేరింది. అక్కడే వినీత్‌‌తో పరిచయం ఏర్పడింది. శిక్షణ పూర్తయ్యాక వినీత్‌ ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేశాడు.

ఆమె ఆస్తి చూసి దురాలోచన

ఆమె ఆస్తి చూసి దురాలోచన

ఆమెతో ఉన్న స్నేహాం కారణంగా అతను ఆమె ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆమె ఇల్లు, ఆస్తి చూసిన తర్వాత వినీత్‌లో దురాలోచన పుట్టింది. మె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో ఉంచితే రూ.కోట్లు వస్తాయని భావించాడు. ఇదే విషయం స్నేహితులు, వీడియో గ్రాఫర్లైన వగ్గు గణేష్‌, గొల్లపల్లి మహేశ్‌లకు చెప్పాడు. వారు మార్ఫింగ్‌ చిత్రాలు తయారు చేశారు.

రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

రూ.5 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

ఈ నెల 9వ తేదీన ఆమెకు వినీత్ ఫోన్ చేశాడు. నీ నగ్నచిత్రాలు చూసుకో అంటూ వాట్సాప్‌లో పంపించాడు. రూ.5 కోట్లు ఇవ్వకుంటే వాటిని ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. ఆమె భయపడి విషయాన్ని తండ్రికి చెప్పింది. ఆ డబ్బు ఇచ్చేందుకు ఆ తండ్రి సిద్ధమయ్యాడు.

ఫోన్లు ట్రాక్ చేశారు

ఫోన్లు ట్రాక్ చేశారు

ఆ తర్వాత పలువురి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువతి తండ్రి. ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ఒక ప్లాన్ రూపొందించారు. వినీత్‌, అతడి స్నేహితుల సెల్‌ఫోన్లను ట్రాక్ చేశారు. రూ.20 లక్షలు ఇస్తామంటూ అగర్వాల్‌తో వినీత్‌కు ఫోన్‌ చేయించారు. అగర్వాల్‌ నగదుతోపాటు కారులో వినీత్‌ చెప్పిన ప్రాంతానికి బయలుదేరారు. అదే కారు డిక్కీలో ఓ ఎస్సై, వెనుక మారువేషంలో మరో ఎస్సై అనుసరించారు.

వారిని పట్టుకున్నారు

వారిని పట్టుకున్నారు

డబ్బులతో వస్తున్నామని, కొంపల్లి వద్దకు రావాలని యువతి తండ్రి... వినీత్‌కు సూచించాడు. యువతి తండ్రి శుక్రవారం కొంపల్లికి వెళ్లగా పోలీసులు అనుసరిస్తున్నారని గ్రహించిన వినీత్‌ నిర్మానుష్య ప్రాంతానికి రావాలన్నాడు. అక్కడికి యువతి తండ్రి వెళ్లగానే బైక్‌పై మహేశ్‌, గణేష్ వచ్చారు. డబ్బులు ఇచ్చే సమయంలో వెనుకనుంచి ఇద్దరు ఎస్సైలు వచ్చి గణేష్‌, మహిపాల్‌లను అదుపులోకి తీసుకున్నారు.

 వినీత్‌ను ఇలా పట్టుకున్నారు

వినీత్‌ను ఇలా పట్టుకున్నారు

ఆ తర్వాత ఒకరిచే వినీత్‌కు ఫోన్‌ చేయించారు. వినీత్‌ను పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు... గణేష్‌, మహేష్‌లను తీసుకుని బైక్‌పై వెళ్లారు. పోలీసులు అనుసరిస్తున్నారని అనుమానించిన వినీత్ వారిని ఎన్నో ప్రాంతాలకు తిప్పాడు. చివరికి నిజామాబాద్‌ హైవే పైకి రావాలని చెప్పాడు. గణేష్‌ బైక్‌ నడుపుతుండగా ఓ ఎస్సై హెల్మెట్ పెట్టుకొని వెనుక కూర్చున్నాడు. వినీత్‌ బైక్‌పై హైవేపైకి వచ్చి గణేష్‌ నుంచి డబ్బు తీసుకునేటప్పుడు బైక్‌ వేగాన్ని తగ్గించాడు. వెంటనే కిందికి దూకిన ఎస్సై... వినీత్‌ బైక్‌ను పట్టుకున్నాడు. వినీత్‌తో పాటు గణేష్‌, మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. శనివారం నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

English summary
Three youth arrested for blackmail hyderabad girl on Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X