వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీటు కాదు పార్టే ముఖ్యం : టికెట్ దక్కకున్నా వీడిదిలేదంటున్నా దత్తన్న

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : టికెట్ కాదు పార్టీ ముఖ్యమన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. లోక్‌సభ ఎన్నికల్లో సీటివ్వలేదని పార్టీ మారే వ్యక్తిని కాదన్నారాయన. 1980 నుంచి బీజేపీలో ఓ సైనికుడిలా పనిచేస్తున్నానని చెప్పారు. తనకు పార్టీ ఉన్నతి, బలోపేతమే ముఖ్యమని స్పష్టంచేశారు.

గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు

1980 దశకంలో చేరిక

1980 దశకంలో చేరిక

తొలినుంచి ఆరెస్సెస్ భావజాలం కలిగిన బండారు దత్తాత్రేయ, 1980లో బీజేపీలో చేరారు. క్రమంగా నాయకుడిగా ఎదిగి 1984లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పటినుంచి, ఇప్పటివరకు టికెట్ అడగలేదని .. పార్టీయే అవకాశం కల్పించిందని గుర్తుచేశారు.

కిషన్‌రెడ్డికి ఫుల్ సపోర్ట్

కిషన్‌రెడ్డికి ఫుల్ సపోర్ట్

తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానన్న దత్తాత్రేయ ... కిషన్‌రెడ్డి విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ జెండా ఎగిరేందుకు శక్తివంచన లేకుండా క‌ృషిచేస్తానన్నారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ..

దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ..

సీఎం కేసీఆర్ హిందూత్వం గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టేనని విమర్శించారు. ఓ వైపు ఎంఐఎంతో కలిసి పొత్తు కొనసాగుతూనే .. మరోవైపు హిందూత్వంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌కు హిందూత్వంపై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారాయన.

English summary
Not a ticket but a party importannt says ex Union Minister Bandaru Dattatreya. The party is not the one who changes the Lok Sabha elections. he has been working as a soldier in the BJP since 1980. He said that the party strong is important.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X