వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీట్ల చిచ్చు: వరంగల్ వెస్ట్‌పై రావు పద్మ అసంతృప్తి, బీజేపీ ఆఫీస్‌ వద్ద టెన్షన్ టెన్షన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలోను సీట్ల చిచ్చు రాజుకుంది. ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్తి జ్వాలలు చూస్తున్నాం. తెలంగాణలో అంతగా బలం లేని బీజేపీ కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడైంది.

<strong>ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్‌లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...</strong>ఆ సర్వేలతో సంబంధం లేదు, మెదక్‌లో పోటీ చేయమంటున్నారు: లగడపాటి, జగన్ మీద దాడిపై...

పలు జిల్లాల్లో అసంతృప్తి

పలు జిల్లాల్లో అసంతృప్తి

బీజేపీలో రెండు దఫాలుగా అరవై మందికి పైగా అభ్యర్థులను ప్రకటించారు. మొదటి దఫాలో ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో 28 మంది పేర్లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాపై నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అసంతృప్తులు కనిపించాయి.

వరంగల్ వెస్ట్- రావు పద్మ అసంతృప్తి

వరంగల్ వెస్ట్- రావు పద్మ అసంతృప్తి

వరంగల్ వెస్ట్ స్థానాన్ని ధర్మారావుకు కేటాయించారు. దీనిపై పార్టీ నాయకురాలు రావు పద్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ను కలిసేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆరుసార్లు ఓడిపోయిన ధర్మారావుకు టిక్కెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారు.

హైదరాబాదులోను అసంతృప్తి

నిజామాబాద్ అర్బన్ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించారు. ఇక్కడ టిక్కెట్ ఆశీస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌లోను కొన్ని చోట్ల అసంతృప్తులు కనిపిస్తున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించారు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Ticket troubles. Cadre unhappy with BJP's choice of candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X