హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబోయ్ పులి: జూ ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చిన బెంగాల్ టైగర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కులో ఎన్ క్లోజర్ నుంచి రాయల్ బెంగాల్ టైగర్ బయటకు వచ్చిన ఘటన శనివారం సాయంత్రం కలకలం రేపింది. పులి బోను నుంచి బయటకు రావడంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు.

వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు సందర్శకులను బయటకు పంపివేశారు. గేట్లను మూసివేసి పులికి మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. పులి ఎవరికి ఎలాంటి హాని చేయపోవడంతో జూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం కావడంతో జూ పార్క్‌కు సందర్శకులు భారీగా తరలివచ్చారు.

Tiger escapes from enclosure at nehru zoological park

హైదరాబాద్ బస్టాండ్లలోనూ ‘వైఫై'

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రారంభమైన వైఫై సేవలు ఇకనుంచి బస్టాండ్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్టాండ్లలోనూ వైఫై సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాట్లు చేస్తోంది.

ముందస్తుగా జిల్లా కేంద్రాల్లో వచ్చే నెల మొదటి వారంనాటికి వైఎఫ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎఫ్‌ సేవలను మరింత వేగంగా, నాణ్యతతో అందించే క్రమంలో ‘5జీ' సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగించుకోనుంది.

Tiger escapes from enclosure at nehru zoological park

ఈ వైఎఫ్‌ సేవలను తొలి అరగంటపాటు ఉచితంగా ఇవ్వాలని, ఆ తర్వాత గంటకు రూ.10 చొప్పున యూజర్‌ ఛార్జీలను వసూలు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయించింది.

English summary
Tiger escapes from enclosure at nehru zoological park.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X