హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇవాంకా టూర్: రంగంలోకి 'జేమ్స్‌బాండ్‌‌లు', మహిళా ఐపిఎస్ అధికారి రక్షణ

ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన కోసం ఆమెరికా అనేక రకాల ముందు జాగ్రత్తలను తీసుకొంటుంది. జేమ్స్‌బాండ్ సినిమాలను తలపించే రీతిలో రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ బాధ్యతలను అమెరికా తీసుకొంటుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన కోసం ఆమెరికా అనేక రకాల ముందు జాగ్రత్తలను తీసుకొంటుంది. జేమ్స్‌బాండ్ సినిమాలను తలపించే రీతిలో రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ బాధ్యతలను అమెరికా తీసుకొంటుంది.ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని ఆమె పర్యటించే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లపై అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.

Recommended Video

Ivanka Trump's hyderabad visit : ఆద్యంతం రహస్యం, ధోనీ వస్తున్నాడా ?

ఇవాంకా ట్రంప్ టూర్: సివిల్ దుస్తుల్లోనే పోలీసులు, తలనొప్పిగా భద్రతఇవాంకా ట్రంప్ టూర్: సివిల్ దుస్తుల్లోనే పోలీసులు, తలనొప్పిగా భద్రత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఈ నెల 28న, జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రైన్యూస్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రానున్నారు. అయితే ఆమె పర్యటనకు సంబంధించి రక్షణ చర్యలను అమెరికా అధికారులే స్వయంగా చూసుకొంటున్నారు.

ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని ఇప్పటికే తెలంగాణ పోలీసులకు అమెరికా పోలీసులు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. ఈ సూచనల ఆధారంగా తెలంగాణ పోలీసులు వ్యవహరించనున్నారు.

రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం

రహస్యంగా ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం

ఇవాంకా ట్రంప్ రక్షణ కోసం అమెరికాకు చెందిన జేమ్స్‌బాండ్‌లు మాత్రం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచరిస్తున్నారు. ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతంలో వారు పర్యటనలు చేస్తూ జాగ్రత్తలు రక్షణ వ్యవహరాలు చూస్తున్నారు. ముందస్తుగా అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇవాంకా పర్యటనలో ఎక్కడెక్కడకు వెళతారు? ఎవరెవరు ఆమెను కలుస్తారు? వారి నేపథ్యం ఏంటి? వారికున్న భద్రత, సామాజిక స్థాయి ఏమిటి? వంటి వివరాలన్నింటినీ అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు రహస్యంగా సేకరిస్తున్నారు.15 మంది అమెరికన్‌ జేమ్స్‌బాండ్‌లు నెల రోజుల కిందే హైదరాబాద్‌కు వచ్చారని సమాచారం.

పర్యాటకుల తరహలో సమాచార సేకరణ

పర్యాటకుల తరహలో సమాచార సేకరణ

ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటనను పురస్కరించుకొని అమెరికా అధికారులు మామూలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. సాధారణ విదేశీ పర్యటకులుగా వచ్చిన ఆ ఏజెంట్లు.. ఇవాంకా పర్యటించే ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, రోడ్‌మ్యాప్, ఇక్కడి పోలీసులు చేపడుతున్న భద్రతా వ్యవహారాలు.. తదితర అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించి అమెరికా భద్రతా విభాగాలకు పంపుతున్నారని సమాచారం.

 పాతబస్తీలో ఇవాంకా టూర్‌పై

పాతబస్తీలో ఇవాంకా టూర్‌పై

ఇవాంకా పాల్గొనే సదస్సులో వేదిక మీద ఉండే వాళ్లు ఎవరు, వారి పూర్తి వివరాలేమిటి అనే అంశాలతోపాటు చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ ప్రాంతాలు, అక్కడి నిర్వాహకులెవరనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగానే ఇవాంకా ట్రంప్ పర్యటనను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఇవాంకా ట్రంప్ రక్షణకు మహిళా ఐపిఎస్ అధికారి

ఇవాంకా ట్రంప్ రక్షణకు మహిళా ఐపిఎస్ అధికారి

ఇవాంకా భద్రతా, లైజన్‌ ఆఫీసర్‌గా మహిళా అధికారిని నియమించేందుకు పోలీస్‌ శాఖ సన్నాహలు చేస్తోంది.ఎఫ్‌బీఐ వర్గాలు ఇచ్చే సూచనల మేరకు ఎస్పీజీ నుంచి మహిళా అధికారిని కేటాయించే అవకాశముందని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. అయితే తెలంగాణలో పర్యటన కాబట్టి ఇక్కడి ఎస్పీ ఆపై స్థాయి ఉన్న మహిళా అధికారిని నియమించుకునేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

English summary
Indian and US agencies will throw a five-tier security ring around US President Donald Trump’s daughter, Ivanka Trump, during her three-day visit to Hyderabad for a high-profile entrepreneurship conference.Prime Minister Narendra Modi will inaugurate the Global Entrepreneurship Summit on November 28 at the Hyderabad International Convention Centre in the capital of Telangana.Sources said the five-tier security will also be in place at the Falaknuma Palace, converted into a hotel by the Taj group, where Ivanka will attend a dinner hosted by the Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X