• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయిపాయే... టిక్ టాక్ పూర్తిగా బంద్... గుండె పగిలిన బాధలో ఆ స్టార్స్...

|

వ్యక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడం... వారికి సంతోషం కలిగించడం... అనే కాన్సెప్ట్‌తో మొదలైన టిక్‌టాక్ యాప్ భారత్‌ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 14 స్థానిక భాషలతో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అందించి... లోకల్‌గా ఎంతోమందికి సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. అలాంటి యాప్ ప్రస్థానానికి భారత్‌లో తెరపడింది. సైబర్ సెక్యూరిటీ రీత్యా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌ సహా 59 చైనా యాప్స్‌పై సోమవారం(జూన్ 29) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం నాటికి టిక్ టాక్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

  TikTok Stops Working యాప్ బ్యాన్‌పై ట్రోల్స్, టిక్ టాక్ స్టార్ల గుండె పగిలిపోయింది...!! || Oneindia
  ఈ సాయంత్రంతో ముగిసిన టిక్ టాక్ ప్రస్థానం...

  ఈ సాయంత్రంతో ముగిసిన టిక్ టాక్ ప్రస్థానం...

  టిక్‌టాక్‌పై నిషేధం ప్రకటించిన తర్వాత చాలామంది యూజర్స్‌లో గందరగోళం ఏర్పడింది. తక్షణం యాప్‌పై నిషేధం విధిస్తారా.. లేక మరి కొద్దిరోజుల సమయం పడుతుందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమయ్యాయి. మంగళవారం కూడా యాప్ ఎప్పటిలాగే పనిచేయడంతో... నిషేధం ఎప్పటినుంచి అమలవుతుందోనన్న డైలామా వారిని వెంటాడింది. కానీ సాయంత్రం సమయానికి యాప్ సేవలు నిలిచిపోవడంతో... ఇక టిక్‌టాక్ ప్రస్థానం ముగిసిపోయిందని ఫిక్స్ అయిపోయారు.

  ఇప్పుడు టిక్ టాక్ ఓపెన్ చేస్తే...

  ఇప్పుడు టిక్ టాక్ ఓపెన్ చేస్తే...

  మొదట భారత్‌లోని అన్ని సర్వీస్ ప్రొవైడర్లు టిక్ టాక్ యాప్‌ను తొలగించాయి. తాజాగా యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు టిక్ టాక్‌ యాప్ ఓపెన్ చేస్తే 'నో నెట్‌వర్క్ కనెక్షన్.' అన్న మెసేజ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతోంది. టిక్‌ టాక్ యాప్ సర్వర్‌కు ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో దాని సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. టిక్ టాక్ యాప్ ఓపెన్ చేసేవారికి... దానిపై మరో మెసేజ్ కూడా కనిపిస్తోంది. 'డియర్ యూజర్స్,కేంద్ర ప్రభుత్వం విధించిన 59 యాప్స్‌పై నిషేధానికి అనుగుణంగా ఆ ఆదేశాలను పాటిస్తున్నాం. భారత్‌లోని మా వినియోగదారుల గోప్యత,భద్రతకు భరోసా ఇవ్వడం మా అతిపెద్ద ప్రాధాన్యత.' అన్న సందేశాన్ని అక్కడ గమనించవచ్చు.

  ఫేస్‌బుక్‌లో ఫన్నీ వీడియోలు...

  ఫేస్‌బుక్‌లో ఫన్నీ వీడియోలు...

  టిక్‌ టాక్‌పై నిషేధం నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఫన్నీ ఫోటోలు,వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టిక్ టాక్‌లో ఎక్కువగా ఫేమస్ అయిన దుర్గారావు,ఉప్పల్ బాలు,కాగజ్‌నగర్ సాయి,బంజారాహిల్స్ ప్రశాంత్,ఇషా మనోహరి ప్రియ వంటి వాళ్ల ఫోటోలతో యాప్ బ్యాన్‌పై ట్రోల్స్ జరుగుతున్నాయి. యాప్ బ్యాన్ చేయడంతో... ఈ టిక్ టాక్ స్టార్ల గుండె పగిలి ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  టిక్ టాక్ హెడ్ ఏమన్నారు...

  టిక్ టాక్ హెడ్ ఏమన్నారు...

  టిక్ టాక్ నిషేధంపై ఆ యాప్ ఇండియన్ హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. 'కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పటివరకూ మా భారతీయ యూజర్స్ సమాచారాన్ని చైనాతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతో పంచుకోలేదు. ఇక్కడి చట్టాలకు లోబడే యాప్ కార్యకలాపాలను సాగించాం. యూజర్ డేటా ప్రైవసీకి మేము అత్యంత ప్రాధాన్యతనిచ్చాం.తాజా నిషేధంపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు మాకు కబురు వచ్చింది.' అని చెప్పుకొచ్చారు.

  English summary
  The government of India on Monday announced the ban of 59 Chinese apps in the country. A day later one of the most popular short video applications TikTok has been taken down from Apple App store and also Google Play store. For users who have the TikTok app download can still use the app and post videos but officially the platform is now banned in the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more