వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాంకేతికత తెచ్చిన తంటా : ఫిజికల్ టెస్ట్ ల్లో టైం ఛేంజ్, క్యాండెట్ల ఆందోళన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆధునాతన సాంకేతిక పరిజానం పోలీసు అభ్యర్థుల పాలిట శాపమైంది. పోలీసు కొలువు అంటేనే ఫిజిలక్ ఫిట్ నెస్. షార్ట్ ఫుట్, లాంగ్ జంప్, రన్నింగ్ కోసం సమయం చూడటం తప్పనిసరి. గతంలో పకడ్బందీగా ఈ ప్రక్రియ జరిగేదని .. ప్రస్తుతం మిల్లీసెకన్ల తేడాతో అవకాశాలు కోల్పోతున్నామని వాపోతున్నారు.

తప్పుగా రీడింగ్ నమోదు ..

తప్పుగా రీడింగ్ నమోదు ..

పోలీసు కొలువు కోసం నిర్వహించే ఫిజికల్ టెస్టులో రీడింగ్ తప్పుగా నమోదవుతోందని అభ్యర్థులు చెప్తున్నారు. మిల్లీ సెకన్ల వ్యవధి తప్పుగా రికార్డవడంతో ఉద్యోగం కోల్పోతున్నామని చెప్తున్నారు. ఫిజికల్ టెస్ట్ ల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐటెంటిఫికేషన్ రీడర్ ఉపయోగిస్తోన్న తప్పుగా నమోదవుతున్నాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియోఔను నేను కాపాలదారుడినే .. సాంగ్ విడుదల చేసిన మోదీ ..వీడియో

రీడింగ్ తేడా .. పట్టించుకోని అధికారులు

రీడింగ్ తేడా .. పట్టించుకోని అధికారులు

రాష్ట్రంలో 18, వేల 248 పోస్టుల కోసం ఫిబ్రవరిలో ప్రారంభమైన ఫిజికల్ టెస్టుల ప్రక్రియ ఈ నెల 22తో ముగియనుంది. ఫిబ్రవరి 13న ఖమ్మంలో జరిగిన ఈవెంట్స్ లో 100 మీటర్ల విభాగంలో 12.38 సెకన్లతో పూర్తిచేస్తే 21.38 సెకన్లలో పూర్తిచేసినట్టు రికార్డైందని ఓ అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ అంశాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయాడు.

సమయం గడువు పెంచండి ..?

సమయం గడువు పెంచండి ..?

గతంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ ఉండేది. ఒకదానిలో అవకాశం దక్కకుంటే మరో దాని కోసం శ్రమించేవారు. కానీ ఈ సారి ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఒకేసారి ఫిజికల్ టెస్టుల నిర్వహించారు. అయితే 800 మీటర్ల రన్నింగ్ 170 సెకన్లలో పూర్తిచేయాలి. ఈ నెల 2న 170.49 సెకన్ల వరకు అవకాశం కల్పించారు. 0.50 నుంచి 0.99 వరకు చాలామంది అవకాశం కోల్పోయారు. దీంతో తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

జాడలేని ఫెర్మార్మెన్స్ షీట్

జాడలేని ఫెర్మార్మెన్స్ షీట్

పోటీల్లో పాల్గొన్నవారి ఫెర్మార్మెన్స్ షీట్ వారి ఈవెంట్స్ ముగిసిన రెండురోజుల్లో వెబ్ సైట్ లో పొందుపరుస్తామని చెప్పారు. ఫిజికల్ టెస్ట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న కొందరివి కనిపించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 12న అంబర్ పేటలో నిర్వహించన వారి జాబితా కూడా కనిపించడం లేదు. ఇప్పటివరకు 99.6 శాతం ఫర్మార్మెన్స్ షీట్లను వెబ్ సైట్ లో పెట్టామని పోలీసు నియామక బోర్డు అధికారులు సెలవిస్తున్నారు. టెక్నికల్ ఇష్యూ వల్ల కేవలం 0.4 శాతం మంది షీట్లను మళ్లీ పరిశీలిస్తున్నామని .. తిరిగి వెబ్ సైట్ లో పెడుతామని చెప్తున్నారు.

English summary
Candidates say that it is wrong to read in the physical test. Millie's seconds are badly missed and the job is lost. Candidates are concerned that using the Radio Frequency Identification Reader for physical tests is incorrect. On February 13, a candidate had expressed concern over the record for the 21.38 seconds to complete 12.38 seconds in the 100 meters division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X