వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు-రాహుల్‌లకు 'ఎగ్జిట్' షాక్: కేసీఆర్‌దే గెలుపు, ఏ సర్వే ఏం చెప్పిందంటే? 90 సీట్లన్న ఓ సర్వే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Exit Poll Results : TRS Likely To Win Clear Majority | Oneindia Telugu

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన (నేడు) ముగిశాయి.

<strong>ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు </strong>ప్రీపోల్స్, ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకంత ఆసక్తి?.. అవి ఎలా నిర్వహిస్తారు

ఎన్నికలు ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేల్లో తేలింది. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారమని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

టైమ్స్ నౌ సర్వే ప్రకారం తెలంగాణలో ఓటర్లు తెరాస వైపు మొగ్గు చూపారు. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 66 సీట్లు, మహాకూటమికి 37 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, ఇతరులకు 9 సీట్లు వస్తాయని తేలింది.

రిపబ్లిక్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

రిపబ్లిక్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీకి 50-65 సీట్లు, మహాకూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీకి 4-7 సీట్లు, ఇతరులకు 10 నుంచి 17 సీట్లు వస్తాయని తేలింది.

సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ సర్వే ప్రకారం

సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ సర్వే ప్రకారం

సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం తెరాసకు 50 నుంచి 65, మహాకూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీకి 4 నుంచి 7 సీట్లు, ఇతరులకు 10 నుంచి 17 సీట్లు వస్తాయని తేలింది.

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం

2014 ఎన్నికల్లో తెలంగాణ 63 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత దాదాపు 25 మందికి పైగా తెరాసలో చేరారు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెరాస బలం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఫలితం లేకుండా పోతుందని ఎగ్జిట్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది. బీజేపీ పుంజుకున్నదని తేలింది.

 ఇండియా టుడే సర్వే ఎగ్జిట్ సర్వే ప్రకారం

ఇండియా టుడే సర్వే ఎగ్జిట్ సర్వే ప్రకారం

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 79 నుంచి 91 సీట్లు, మహాకూటమికి 21 నుంచి 33 సీట్లు, బీజేపీకి 1- 3 సీట్లు వస్తాయని తేలింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తెరాసకు బొటాపోటీ సీట్లు వస్తాయని తేల్చగా.. ఇండియా టుడే సర్వే మాత్రం ఏకంగా 80 నుంచి 90 వరకు వస్తాయని తేలడం గమనార్హం.

English summary
The Times Now -CNX Exit Poll predicts KCR-led Telangana Rashtra Samithi is all set to retain Telangana. Out of 119 constituencies, the TRS is likely to register victory in 66 seats, whereas the much-talked-about Congress-TDP-CPI-TJP coalition (Peoples Front) is likely to win 37 seats. The BJP is predicted to 7, whereas Others may win 9 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X