ప్రజలు ఎక్కడ సోయికి వస్తారోనని కేసీఆర్ భయం: కోదండరాం..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తనను అరెస్ట్ చేసినంత మాత్రానా పోరాటం ఆగదని స్పష్టం చేశారు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. మిలియన్ మార్చ్‌ను గుర్తు చేసుకోవడం పాలకులకు ఇష్టం లేకనే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

Kodandaram

ఏం మారింది?: 'మిలియన్ మార్చ్' టెన్షన్.. ట్యాంక్ బండ్ అష్టదిగ్బంధం

తెలంగాణలో మరో సంఘటిత పోరాటం చేస్తే ప్రజలు ఎక్కడ సోయిలోకి వస్తారన్న భయం ప్రభుత్వానికి పట్టుకుందన్నారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లకుండా రాష్ట్రవ్యాప్తంగా 3500మందిని అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.

అరెస్టయిన నేతలకు పోలీసులు కనీసం తిండి కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 22-(2) ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తులను 24గం.కు మించి కస్టడీలోకి ఉంచుకోవడానికి వీల్లేనప్పటికీ.. పోలీసులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. జేఏసీ నేతల అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On Saturday, the Telangana Joint Action Committee (TJAC) has planned the Million March anniversary in Hyderabad despite no police permission. TJAC Chief Kodandaram criticized CM KCR over Million march rally.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి