వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలో ప్రకంపనలు, కోదండకు మద్దతు: కేసీఆర్ ఆలస్యంగా మేల్కొన్నారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకు విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. కోదండరాం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు విమర్శలు చేస్తున్నారని, ఉద్యమంలో పాల్గొనని వారు కూడా కోదండ పైన విమర్శలు విడ్డూరమన్నారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడానికే కోదండరాం పైన విమర్శలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందన్నారు.

kodamdaram

తెరాస ప్రభుత్వానిది ఒంటెత్తు పోకడ అని విమర్శించారు. తెలంగాణ సచివాలయం పార్టీ ఫిరాయింపులకు నిలయంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం రెండేళ్ల పాలన పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కోదండరాం విమర్శలు తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

తెరాస ఎందుకంటే ఏమంటారు?: సురవరం

తెలంగాణలో జేఏసీ చైర్మన్ కోదండరాం పైన మంత్రులు, తెరాస నేతల విమర్శలు సరికాదని సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక తెరాస ఎందుకని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

4గురికి చెప్తా కానీ చెప్పించుకోను: దాడి జరిగినా.. కేసీఆర్‌పై యుద్ధనికే కోదండ

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కూడా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెరాస మంత్రులు కోదండరాం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విమర్శల దాడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాగా, కోదండరాం ప్రభుత్వం పైన విమర్శలు చేయడం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షమే లేకుండా చేస్తూ.. తమకు తిరుగులేదనుకుంటున్న తెరాసకు ఇటీవల కోదండరాం చుక్కలు చూపిస్తున్నారు. ఆయన తెరాస నేతలకు ముచ్చెమటలు పోపిస్తున్నారని చెప్పవచ్చు.

ఆ రెండు వ్యాఖ్యలేనా?: కేసీఆర్‌పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు (ఫోటోలు)

తెలంగాణ సాధనలో ఎవరి సహాయం తీసుకున్నారో ఇప్పుడు వారే తమ పైన తిరుగుబాటు బావుటా ఎగిరేసేసరికి కేసీఆర్ సర్కారులో కొంత ప్రకంపనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరెన్ని విమర్శలు చేసినా అంతగా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు కోదండపై విరుచుకుపడుతున్నారు.

ఇన్నాళ్లు మౌనంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతే జేఏసీతో ఏమవుతుంది, కోదండరాం ఒంటరివాడు అని అంతగా పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పునాది వేసుకుని అందరిని ఏకం చేసుకుని ఒక్కసారిగా దండయాత్ర మొదలుపెట్టారు కోదండరాం.

ఇప్పుడు అతను విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రులు ఆయన పైన ఎదురు దాడికి దిగుతున్నారు. దీంతో, విపక్షాలు ఆయనకు అండగా నిలబడుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విమర్శలు చేయడం ఏమిటని విపక్షాలన్నీ కెసిఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కోదండరాం వ్యాఖ్యల పైన ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెరాస నేతలు యావత్తు మండిపడ్డారు. అంటే, కోదండరాం వ్యాఖ్యలు తమకు నష్టం చేస్తాయనే ఉద్దేశ్యంతోనే హరీష్ రావు నుంచి మొదలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, బాల్క సుమన్, నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్ వరకు.. అధికార పార్టీ నాయకులంతా స్పందించారు.

తెరాస అదికారంలోకి వచ్చాక ఒక్క ముఖ్యమంత్రి మినహా దాదాపు మంత్రి వర్గం అగ్రజులంతా ఇలా విరుచుకుపడడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. అంటే కోదండరాం పెట్టిన సెగ తెరాసకు అంటే కేసీఆర్‌కు ఏమేరకు తాకిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

English summary
TJAC, TRS headed for showdown as opposition parties back Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X