వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ కార్యాలయంలో ప్రో.కోదండరాం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. అయితే తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లడంపై ఎలాంటీ రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రో.కోదండరాం చెప్పారు. ఆర్టీసీ కార్మీకుల అందోళనలకు మద్దతు కొరేందుకే తాను పార్టీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మన్‌తో సమావేశం అయ్యారు.

ఈ సంధర్బంగా కొదండరాం మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మీకుల సమ్మెకు అన్ని పార్టీలు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కార్మీకులకు మద్దతుగా రాజకీయ పార్టీల పోరాటం కూడ ఉంటే ప్రభుత్వం దిగివస్తుందని ఆయన చెప్పారు. అయితే ఆర్టీసీ కార్మీకుల సమ్మకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ ప్రకటించినట్టు ఆయన చెప్పారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని వివరించిన ఆయన అన్నిపార్టీలు కూడ ఒకే గొడుగు క్రిందకు వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

TJS president Kodandaram meets with BJP laxman

కాగా ఆర్టీసీ కార్మీకుల పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు కోదండరాం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వారికి మద్దతుగా ఉద్యోగ సంఘాలను కూడగట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాల నేతలను ఆర్టీసీ జేఏసీతో సమావేశం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యుహం పన్నారు. ఇరు వర్గాలు కలిసి చర్చించే సమయంలోనే ఉద్యోగ సంఘాల నాయకులకు తన అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇందులో భాగంగానే రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కోదండరాం కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం.

English summary
Telangana jana samithi president prof, kodandaram met with bjp state president dr.laxman at office in hyderabad on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X