హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలుత నోటిఫికేషన్‌, తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ వార్త త్వరలోనే సాకారం కావడానికి మార్గం సుగమం అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికెషన్ల జారీకి మార్గం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్ కోసం ఏర్పాటు చేసిన ప్రోఫెసర్ హరగోపాల్ కమిటీ తన నివేదికను గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రపాణికి అందజేసింది.

వారం రోజుల్లో ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రపాణి తెలిపారు. తెలంగాణలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం లక్షా ఏడువేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన పూర్తయిన తరువాత ఈ ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత వస్తుంది.

త్వరలోనే ఉద్యోగుల విభజన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి విద్యావేత్తలతో సిలబస్ కమిటీ ఏర్పాటు చేసినట్టు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలు వారికి బాగా తెలుసునని చక్రపాణి తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనంతట తానుగా నోటిఫికేషన్ జారీ చేయదని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ప్రభుత్వం పేర్కొన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చెప్పారు.

గ్రూప్ 4లో ఇకపై వ్యాసాల రూపంలోనే ప్రశ్నలు ఉంటాయి అనే వార్తల్లో నిజం లేదని, ఇవి ఊహాగానాలు మాత్రమేనని ఆయన తెలిపారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుందా? డిస్క్రిప్టివ్‌గా ఉంటుందా? అనేది ప్రభుత్వం తెలుపుతుందని అన్నారు. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్నవారు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నవారు, తెలంగాణకు ఏ విధంగా మేలు కలగాలో ఆలోచించే వారు, తెలంగాణ నిరుద్యోగుల ఆశల గురించి తెలిసిన వారే సిలబస్ కమిటీలో ఉన్నారని చక్రపాణి తెలిపారు.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీ వార్త త్వరలోనే సాకారం కావడానికి మార్గం సుగమం అయింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికెషన్ల జారీకి మార్గం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్ కోసం ఏర్పాటు చేసిన ప్రోఫెసర్ హరగోపాల్ కమిటీ తన నివేదికను గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రపాణికి అందజేసింది.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

వారం రోజుల్లో ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేయనున్నట్టు టిపిఎస్‌సి చైర్మన్ చక్రపాణి తెలిపారు. తెలంగాణలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం లక్షా ఏడువేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల విభజన పూర్తయిన తరువాత ఈ ఖాళీల సంఖ్యపై మరింత స్పష్టత వస్తుంది.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

త్వరలోనే ఉద్యోగుల విభజన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి విద్యావేత్తలతో సిలబస్ కమిటీ ఏర్పాటు చేసినట్టు, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలు వారికి బాగా తెలుసునని చక్రపాణి తెలిపారు.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనంతట తానుగా నోటిఫికేషన్ జారీ చేయదని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ప్రభుత్వం పేర్కొన్న ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చెప్పారు. గ్రూప్ 4లో ఇకపై వ్యాసాల రూపంలోనే ప్రశ్నలు ఉంటాయి అనే వార్తల్లో నిజం లేదని, ఇవి ఊహాగానాలు మాత్రమేనని ఆయన తెలిపారు.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్నవారు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నవారు, తెలంగాణకు ఏ విధంగా మేలు కలగాలో ఆలోచించే వారు, తెలంగాణ నిరుద్యోగుల ఆశల గురించి తెలిసిన వారే సిలబస్ కమిటీలో ఉన్నారని చక్రపాణి తెలిపారు.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

‘‘వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించాం. తెలంగాణ పునఃనిర్మాణం మరింత పటిష్ఠంగా జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయటం ద్వారా పరిపాలన సజావుగా కొనసాగాలి. ప్రస్తుతానికి పెద్ద స్థాయిలో మార్పులు సూచించలేదు'' అని తెలిపారు.

 తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

తొలుత నోటిఫికేషన్‌... ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్ష

ఇక గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్‌ 622 వెలువడింది. అయితే... దీని అమలు మాత్రం నిలిపివేశారు. 2014 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ... ఉద్యమాలు, ఎన్నికలు, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో ‘విలీనం' ఉత్తర్వులు అమలు కాలేదు.

తెలంగాణ గురించి అన్ని కోణాల్లో తెలుసుకునే విధంగా ఈ సిలబస్ ద్వారా అవకాశం ఏర్పడుతుందని అన్నారు. సకాలంలో నివేదిక అందజేసినందుకు హరగోపాల్ నాయకత్వంలోని సిలబస్ కమిటీకి చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. చక్రపాణికి నివేదిక ఇచ్చిన తరువాత ప్రొఫెసర్ హరగోపాల్ మీడియాతో మాట్లాడారు.

‘‘వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించాం. తెలంగాణ పునఃనిర్మాణం మరింత పటిష్ఠంగా జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయటం ద్వారా పరిపాలన సజావుగా కొనసాగాలి. ప్రస్తుతానికి పెద్ద స్థాయిలో మార్పులు సూచించలేదు'' అని తెలిపారు.

ఇక గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్‌ 622 వెలువడింది. అయితే... దీని అమలు మాత్రం నిలిపివేశారు. 2014 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ... ఉద్యమాలు, ఎన్నికలు, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో ‘విలీనం' ఉత్తర్వులు అమలు కాలేదు.

ఇప్పుడు... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. సిలబ్‌సలో మార్పు చేర్పులు సహా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని సర్కారు భావించింది. సిలబస్‌ రివ్యూ కమిటీని కూడా నియమించింది. అయితే... తొలుత ఒక నోటిఫికేషన్‌ జారీ చేసి, ఆ తర్వాతే గ్రూప్‌-1 పరీక్షల్లో సంస్కరణలపై దృష్టి సారించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

English summary
Tnpsc Syllabus Committee meeting in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X