హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి సంఘాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఏబీవీపీ విద్యార్ధులు పరిపాలనా భవనం ముందు బైఠాయించగా, ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహన చేశారు.

సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి వెళ్లిన విద్యార్ధులను ఓయూ పోలీస్ స్టేషన్ ఎదుట అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎంఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి చెప్పులతో కొట్టారు.

ఏబీవీపీ విద్యార్ధులు ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి ఓయూలోని అన్ని విభాగాలను మూయించి బంద్ పాటించారు. నారాయణ గూడ ప్లైఓవర్ చౌరస్తాలో టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రఘుకిరణ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహన చేశారు.

 కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదల పేరిట వర్సిటీ భూములను ప్రైవేట్ సంస్ధలకు దారాదత్తం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

ఓయూ భూముల జోలికి వస్తే సహించేది లేదని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉస్మానియా విద్యార్దులు నడిపించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రఘుకిరణ్ పేర్కొన్నారు.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

గురువారం పీడీఎస్‌యూ విద్యార్థులు తెలంగాణ సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. సీ బ్లాక్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

విద్యార్దులను అదుపులోకి తీసుకుని అంబర్ పేట పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. తెలంగాణకే మకుటమైన ఓయూపై వరాలు కురిపించడం పోయి నాశనం చేయడానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారని విమర్శించారు.

 కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

సీఎం క్యాంప్‌ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించిన ఏఐఎస్‌ఎఫ్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అటు, ఓయూభూములను కాజేయాలని చూస్తే కేసీఆర్‌కు ఓయూలోనే గోరీ కడతామని టీజీవీపీ(ఎన్‌) హెచ్చరించింది.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

మాదిగ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ వద్ద కేసీఆర్‌ ఫొటోను చెప్పులతో కొట్టారు. ఓయూ భూములజోలికి వస్తే కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తామని ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు లింగస్వామి, నగర అధ్యక్షుడు విజయ్‌, ఓయూ ఇంచార్జి శేఖర్‌ హెచ్చరించారు.
 కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

ఎవని అయ్యకు భయపడనంటున్న సీఎం విద్యార్థులు కూడా ఎవరికీ భయపడే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు అన్నారు. పేదల పేరుతో ఓయూ భూముల్ని నొక్కే ప్రయత్నం చేస్తున కేసీఆర్‌ను ఇళ్ల నిర్మాణాల పునాదుల్లోనే పాతరేస్తామని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హెచ్చరించారు.

 కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

ఏబీవీపీ విద్యార్థులు ఓయూ ఆర్ట్స్‌ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ నిర్వహించి ఓయూలోని అన్ని విభాగాలను మూయించి బంద్‌ పాటించారు.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరె డ్డి యాదగిరిరె డ్డి ఓయూ భూమిలోనే పెద్ద హోటల్‌ కట్టాడని ఈ భూములను వెనక్కు తీసుకుని పేదలకు ఇళ్లు కట్టించాలని ఏబీవీపీ నాయకులు హితవు పలికారు.

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

కేసీఆర్‌ను ఓయూలోనే పాతరేస్తాం: ఎంఎస్‌ఎఫ్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అడ్డుకుంటామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కళ్యాణ్‌, అధ్యక్షుడు మానవతారాయ్‌ ప్రకటించారు.

English summary
TNSF Burning Effuji of KCR on University Lands Issue at Narayanaguda X Roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X